Tamil Nadu 12th Results: తమిళనాడులో ప్లస్ టూ (12వ తరగతి) ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ విద్యార్థులను ఉద్దేశించి చేసిన భావోద్వేగపూరిత పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
విజయం సాధించిన వారిని అభినందిస్తూనే, విఫలమైన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఆయన రాసిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
Read Also:Kerala Election Results: మల్లిఖార్జున్ ఖర్గేతో ఎంపీ శశిధరూర్ భేటీ
విజేతలకు అభినందనలు.. వెనుకబడిన వారికి అండ
తమిళనాడు బోర్డు పరీక్షల్లో ఈ ఏడాది 95.20 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా విజయ్ తన సందేశంలో ఇలా పేర్కొన్నారు: “పట్టుదలతో శ్రమించి విజయం సాధించిన నా తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అభినందనలు. ఈ విజయం మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువుల వైపు అడుగులు వేయండి” అని కోరారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా లేదా ఫెయిల్ అయినా నిరాశ చెందవద్దని ఆయన సూచించారు. “ఓటమిని చూసి భయపడకండి.. మళ్లీ ప్రయత్నించండి. గుర్తుంచుకోండి, మనం విజయానికి అత్యంత సమీపంలోనే ఉన్నాం. విజయం నిశ్చయం!” అంటూ భరోసా ఇచ్చారు.
Tamil Nadu 12th Results: అమ్మాయిలదే పైచేయి
ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు 97% ఉత్తీర్ణతతో అబ్బాయిల కంటే (93.19%) ముందంజలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోడ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచి సత్తా చాటింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులు, యువతతో విజయ్ నిరంతరం మమేకమవుతుండటం గమనార్హం. గతంలో కూడా టాపర్లను స్వయంగా కలిసి ఆయన సన్మానించిన విషయం తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
తమిళనాడులో పొలిటికల్ హీట్: కాంగ్రెస్ భారీ ధర్నాలు!

