Megastar Chiranjeevi: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
అన్న శతకకారుడి మాటలను నిజం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. అంతర్జాతీయ వేదికలపై తన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అందుకుంటున్న గౌరవాన్ని చూసి ఒక తండ్రిగా ఆయన గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ రామ్ చరణ్‌ను కొనియాడటంపై చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Read Also : Rajinikanth Dharman movie: కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ 'ధర్మన్'.. ఫస్ట్ లుక్ విడుదల
Proud to be a father.. Chiranjeevi’s emotional post on Ram Charan!
Megastar Chiranjeevi: ప్రధాని నోట "న్యూ ఏజ్ మెగాస్టార్"
ప్రముఖ జాతీయ ఛానల్ 'రిపబ్లిక్ టీవీ' నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రధాని మోదీ మాట్లాడుతూ రామ్ చరణ్‌ను "న్యూ ఏజ్ మెగాస్టార్" అని సంబోధించారు. దేశ ప్రధాని స్థాయి వ్యక్తి తన కుమారుడిని ఇంతటి పవర్‌ఫుల్ బిరుదుతో పిలవడం చూసి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యానికి గురైనట్లు వ్యక్తం చేశారు.
ఇలాంటి అంతర్జాతీయ స్థాయి గౌరవాలు, ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న అరుదైన గుర్తింపును చూస్తుంటే ఒక తండ్రిగా చెప్పలేనంత గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. రామ్ చరణ్ తన నిరంతర కృషి, అంకితభావం, అద్భుతమైన నటనతో కేవలం ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా అగ్రనేతల నుంచి విశేషమైన గుర్తింపును సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమని కొనియాడారు. చరణ్ భవిష్యత్తులో ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మెగాస్టార్ తన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

