Dailyhunt
ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. ముగ్గురూ ఎమ్మెల్యేలే!

ఒకే కుటుంబం.. మూడు పార్టీలు.. ముగ్గురూ ఎమ్మెల్యేలే!

వార్త 3 days ago

Santiago Martin Family: రాజకీయాల్లో వారసత్వం సాధారణమే కానీ, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మూడు వేర్వేరు పార్టీల నుంచి, మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి, ముగ్గురూ విజయం సాధించడం అనేది అత్యంత అరుదైన విషయం.

ఈ అసాధారణ రికార్డును ప్రముఖ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ కుటుంబం సొంతం చేసుకుంది. తమిళనాడు మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కుటుంబం క్లీన్ స్వీప్ చేసి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.

శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్ తమిళనాడులోని లాల్‌గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే (AIADMK) అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం నమోదు చేశారు. గత 20 ఏళ్లుగా డీఎంకేకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఆమె జెండా పాతారు. టీవీకే అభ్యర్థి కుపా కృష్ణన్‌పై 2,739 ఓట్ల మెజారిటీతో, డీఎంకే అభ్యర్థి టి. పరివల్లాపై 5,000 పైగా ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Read Also :West Bengal: మే 9న పశ్చిమ బెంగాల్లో BJP ప్రభుత్వం ప్రమాణస్వీకారం?

 One family.. three parties.. all three are MLAs!

Santiago Martin Family: విజయ్ పార్టీలో అల్లుడి జోరు

మరోవైపు మార్టిన్ అల్లుడు, ఆధవ్ అర్జున నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తరపున తన సత్తా చాటారు. టీవీకే జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన.. విక్కివాక్కం నియోజక వర్గంలో డీఎంకే అభ్యర్థి కార్తీక్ మోహన్‌పై 17,302 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

పుదుచ్చేరిలో సొంత పార్టీతో కొడుకు విజయం

తమిళనాడులోనే కాకుండా పొరుగున ఉన్న పుదుచ్చేరిలోనూ మార్టిన్ కుటుంబ జైత్రయాత్ర కొనసాగింది. శాంటియాగో మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్.. తన సొంత పార్టీ అయిన లచ్చియ జననాయక కట్చి (LJK) తరపున కామరాజ్ నగర్ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిని 10,000 ఓట్ల భారీ తేడాతో ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పరపతి దెబ్బతినకుండా మార్టిన్ వ్యూహం!

గతంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారీగా విరాళాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన మార్టిన్ కుటుంబం, ఇప్పుడు నేరుగా అధికార పీఠాలను అధిరోహించడం విశేషం. భార్య ఏఐఏడీఎంకేలో, అల్లుడు టీవీకేలో, కొడుకు సొంత పార్టీలో ఉండటం ద్వారా, ఒకే కుటుంబం నుంచి ముగ్గురు వ్యక్తులు వేర్వేరు జెండాలతో విజయం సాధించి ‘పొలిటికల్ జాక్‌పాట్’ కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వికసిస్తున్న కమలాలు.. బెంగాల్‌లో చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ ప్రశంస

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha