Telangana Assembly cost:తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గంట మోగించగానే చర్చలు మొదలవుతాయి. అయితే ప్రతి గంటకు రూ. 15 నుండి 20 లక్షల వరకు ఖర్చు అవుతోంది.
ఢిల్లీకి చెందిన పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఈ గణాంకాలను వెల్లడించింది. శాసనసభ సజావుగా సాగాలంటే తెరవెనుక పెద్ద సైన్యమే పనిచేస్తుంది. సభ నిర్వహణ కోసం ప్రతి క్షణం భారీగా ఆర్థిక భారం పడుతోంది. ఈ వివరాలన్నీ తాజాగా బయటకొచ్చాయి.
Read also: Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు కీలక రైళ్ల వేళల్లో మార్పులు
Ringing the Assembly bell costs Rs 20 lakh.
సిబ్బంది భత్యాల ఖర్చు
అసెంబ్లీ సచివాలయ సిబ్బంది, మార్షల్స్, పోలీసులు భారీ సంఖ్యలో సేవలు అందిస్తారు. వివిధ శాఖలకు చెందిన 400 మంది అధికారులు సమాధానాలు సిద్ధం చేయడానికి వస్తారు. వీరికి ఓవర్ టైమ్ అరెవెన్స్, భోజనం, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఏసీలు, లైటింగ్, లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లకు అదనపు ఖర్చు అవుతుంది. ప్రతి ఎమ్మెల్యేకు రోజువారీ భత్యం మరియు జీతాలు ఉంటాయి.
Telangana Assembly cost:రోజువారీ నిర్వహణ వ్యయం
సభకు హాజరు కాకపోయినా జీతం వస్తుంది కానీ డైలీ అలవెన్స్ సభకు వస్తేనే లభిస్తుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శాసనసభకు కోటి నుండి కోటిన్నర ఖర్చు అవుతుంది. గతంలో ఒక బ్రీఫింగ్ మీటింగ్ కి భారీగా ఖర్చు చేసినట్లు జీవో విడుదల అయింది. గత ఏడాది రాష్ట్ర అసెంబ్లీ 149 గంటలపాటు జరిగినట్లు పీఆర్ఎస్ నివేదిక చెబుతోంది.
Epaper: epaper.vaartha.com

