Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ola, Uber, Rapido సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు!

Ola, Uber, Rapido సంస్థలకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు!

వార్త 1 day ago

Delhi High Court: యాప్ ఆధారిత క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఓలా, ఉబర్, రాపిడో సంస్థలకు మహిళల భద్రతకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ప్రయాణికుల రక్షణకు ఈ ప్రైవేట్ రైడ్-హెయిలింగ్ సంస్థలనే పూర్తి బాధ్యులను చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై కోర్టు స్పందించింది. క్యాబ్ సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వానికి కూడా ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది.

Read Also : Firecrackers ban: దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 Delhi High Court issues notices to Ola, Uber, and Rapido!

Delhi High Court: యాప్‌లోని డ్రైవర్ వివరాల వెరిఫికేషన్

అదిత్య సెహగల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి తేజస్ కారియాతో కూడిన ధర్మాసనం విచారించింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారి రక్షణ కోసం డ్రైవర్ల తనిఖీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిటిషనర్ కోరారు. ప్రయాణికుడు రైడ్ బుక్ చేసినప్పుడు యాప్‌లో కనిపించే డ్రైవర్, వాహన వివరాలు వాస్తవంగా వచ్చే డ్రైవర్ మరియు వాహనంతో ఖచ్చితంగా సరిపోలేలా కఠినమైన ధ్రువీకరణ (Verification) వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర సమయాల్లో సహాయం కోసం 24 గంటల పాటు పనిచేసే ‘కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

రైడ్-హెయిలింగ్ సంస్థలకే బాధ్యత ఉండాలి: ధర్మాసనం

యాప్ ఆధారిత రవాణా సేవలను అందించే ప్రైవేట్ సంస్థలు ప్రయాణికుల భద్రత విషయంలో జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రయాణికుల రక్షణ ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నోటీసులు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది.

మంగళూరు రిఫైనరీలో పేలుడు.. ఎనిమిది మందికి గాయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha