Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: శ్రేయస్ అయ్యర్

ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం: శ్రేయస్ అయ్యర్

వార్త 1 week ago

Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది..

ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి కావడం విశేషం. ఈ ఫలితంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి.

Read Also:Sri Lanka Tri-Series 2026: శ్రీలంక టూర్‌కు ఇండియా 'ఎ' జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఆవేదనను వ్యక్తం చేసాడు.. ఈ ఓటమికి తమ జట్టులో ఏ ఒక్కరిని నిందించలేనని చెప్పాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగానే ఉన్నా.. ఇదో అద్భుతమైన మ్యాచ్ అని తెలిపాడు. ‘నిజానికి ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క సందర్భాన్ని వేలెత్తి చూపాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇది గొప్ప మ్యాచ్.ఇరు జట్లు అద్భుతంగా పోరాడాయి. తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా అతను షాట్లను ఎంచుకున్న విధానం బాగుంది. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని తరలించిన తీరు అమోఘం. ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా అతనికే దక్కుతుంది.

ఒమర్జాయ్ విధ్వంసాన్ని మెచ్చుకున్న కెప్టెన్

తమ జట్టులోని అజ్మతుల్లా ఒమర్జాయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని తెలిపాడు. ఒకానొక దశలో తాము 170 నుంచి 180 పరుగులకే పరిమితం అవుతామని అనుకున్నామని, అయితే.. అతడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్ మొమెంటంను తమ వైపుకు మార్చివేశాడని తెలిపాడు. అతను ఆడిన స్కూప్ షాట్స్ అద్భుతం అని అన్నాడు. అతడి వల్లే తాము 200 పరుగులు చేశామన్నాడు.

 Shreyas Iyer Post Match Interview

Shreyas Iyer: ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

వరుసగా ఐదు ఓటములతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో వెనుకబడింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. కేవలం గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. తదుపరి మ్యాచ్‌కైనా పంజాబ్ పుంజుకుంటుందో లేదో చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CSK టీం లోకి డయాన్ ఫోరెస్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha