Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీలంక టూర్‌కు ఇండియా 'ఎ' జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

శ్రీలంక టూర్‌కు ఇండియా 'ఎ' జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

వార్త 1 week ago

Sri Lanka Tri-Series 2026: శ్రీలంక వేదికగా వచ్చే నెలలో జరగనున్న వన్డే ముక్కోణపు సిరీస్ (ట్రై-సిరీస్) కోసం భారత 'ఎ' జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఈ టోర్నీలో భారత్, శ్రీలంకతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి.యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించే లక్ష్యంతో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీ ద్వారా భవిష్యత్ స్టార్లను వెలికితీయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.

Read Also:CSK Squad Changes 2026: CSK లోకి సౌతాఫ్రికా యంగ్ స్టార్

Sri Lanka Tri-Series 2026: కీలక బాధ్యతలు

ఐపీఎల్, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.డాషింగ్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ జట్టుకు ఉప నాయకుడిగా వ్యవహరించనున్నాడు.

 India A squad for Sri Lanka tri-series 2026

జట్టు విశేషాలు

కేవలం 15 ఏళ్ల వయస్సులోనే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇండియా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.ఓపెనింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉండగా, మిడిల్ ఆర్డర్‌లో ఆయుష్ బదోని, రమణ్‌దీప్ సింగ్ వంటి పవర్‌ఫుల్ ఫినిషర్లు ఉన్నారు.యష్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్‌లతో కూడిన పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది.

    షెడ్యూల్:

    ఈ ముక్కోణపు సిరీస్ జూన్ 9వ తేదీన ప్రారంభం కానుంది. సీనియర్ టీమ్ ఇండియాలోకి ప్రవేశించాలనుకునే యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

    ఇండియా ‘ఎ’ పూర్తి స్క్వాడ్

    తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, హర్ష్ దూబే, సూర్యవంశ్ షెడ్జె, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్ర, విప్రజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్ వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read Also:

    టాస్ గెలిచిన ముంబై

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha