Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటమిపై రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్స్

ఓటమిపై రిషబ్ పంత్ ఎమోషనల్ కామెంట్స్

వార్త 1 month ago

Rishabh Pant: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) దురదృష్టం కొనసాగుతోంది. సొంత గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నోకు మరో పరాజయం ఎదురైంది.

ఈ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది కోల్‌కతా. ఆరో ఓటమి చవిచూసిన లక్నో సూపర్ జెయింట్స్.. పాయింట్స్ పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.

Read Also: Anushka Sharma: RCB మ్యాచ్‌లో విరాట్ భార్య ధరించిన బ్రాండ్స్ ఇవే

Rishabh Pant:

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. జట్టు పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశాడు. "మాకు విరామం అవసరం. ప్రతి మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుంది. బయట కారణాలు వెతకకుండా, మనలోనే పరిష్కారాలు కనుగొనాలి. ప్రతి ఆటగాడు బాధ్యత తీసుకోవాలి. ఇది ఒక్కరిద్దరి ఆట కాదు" అని వ్యాఖ్యానించాడు. సూపర్ ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను పంపిన నిర్ణయాన్ని కూడా పంత్ సమర్థించాడు. "అతను ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా, కష్ట సమయాల్లో మన ఆటగాళ్లను నమ్మాలి" అని తెలిపాడు.

    సూపర్ ఓవర్లో నికోలస్ పూరన్‌ను బ్యాటింగ్‌కు పంపించడానికి కారణంపై పంత్ స్పందిస్తూ.. సూపర్ ఓవర్ ముందు మేమంతా చర్చించుకున్నాం. ఆ చర్చలో నికోలస్ పూరన్ పేరు ప్రస్తావనకు వచ్చింది. అతను తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవచ్చు. కానీ, అదే సమయంలో, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు మీ ఆటగాడిని నమ్మాలి. ఈ విషయంలో ఎలాంటి సాకులు లేవు. కానీ, ప్రస్తుతం మా నిర్ణయం తగినంత సానుకూలత లేకపోవచ్చు. కానీ, రాబోయే మ్యాచ్ లలో మా నుంచి మెరుగైన ప్రదర్శన ఉంటుందని నేను నమ్ముతున్నాను అంటూ పంత్ చెప్పుకొచ్చారు.

    Read hindi news: hindi.vaartha.com

    Epaper: epaper.vaartha.com

    Read Also:

    చిన్నస్వామి స్టేడియంలో సీసీటీవీ నెట్‌వర్క్ కట్..అసలేం జరిగింది?

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha