Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్నస్వామి స్టేడియంలో సీసీటీవీ నెట్‌వర్క్ కట్..అసలేం జరిగింది?

చిన్నస్వామి స్టేడియంలో సీసీటీవీ నెట్‌వర్క్ కట్..అసలేం జరిగింది?

వార్త 1 month ago

Chinnaswamy Stadium: బెంగళూరులోని ప్రసిద్ధ చిన్నస్వామి స్టేడియం భద్రతా వైఫల్యం ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఏకంగా 240 సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, భద్రతా వ్యవస్థను స్తంభించిన ఘటన కలకలం సృష్టించింది.

Read Also: KKR vs LSG: ఆ విజయం నా మామగారికి అంకితం: రింకూ సింగ్ కు కాబోయే భార్య

Chinnaswamy Stadium: ఏం జరిగింది? నిఘా నీడలో విధ్వంసం

ఏప్రిల్ 24న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వేల సంఖ్యలో అభిమానులు ఉన్న సమయంలోనే స్టేడియం నిఘా వ్యవస్థను దుండగులు టార్గెట్ చేశారు.ఏకంగా 240 కెమెరాలు పనిచేయకుండా చేశారు. దీనివల్ల ఎంట్రీ గేట్లు, పార్కింగ్ మరియు గ్యాలరీలలో నిఘా పూర్తిగా నిలిచిపోయింది.సీసీటీవీ కంట్రోల్ రూమ్‌లోకి చొరబడి నెట్‌వర్క్ వీడియో రికార్డర్ (NVR) సిస్టమ్‌లను, ఫైబర్ కనెక్షన్లను కట్ చేశారు.సుమారు రూ.10 లక్షల బకాయిలు చెల్లించకపోవడంతోనే ఆగ్రహంతో ఈ విధ్వంసానికి పాల్పడినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

అయితే, ఈ వాదనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల పర్యవేక్షణ, యాక్సెస్ కంట్రోల్ విధానాల్లోని లోపాలను కూడా పరిశీలిస్తున్నారు.స్టేడియం నిఘా వ్యవస్థలతో సంబంధమున్న స్టాక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగి ఆదిత్య భట్ ఫిర్యాదు మేరకు క్యూబన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితులు సున్నితమైన ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై, ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లు చేయడంతో మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ముగిసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఢిల్లీ వీధుల్లో ఆర్‌సీబీ ప్లేయర్స్ షికారు.. గల్లీలో బ్యాట్ పట్టిన విదేశీ స్టార్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha