Ramchander Rao: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి లో మాటల యుద్ధానికి కారణమైంది. ఈ ఓటర్ల లిస్ట్ సవరణ అంశాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీపై బురదజల్లుతున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.
రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు ఈ వ్యవహారాన్ని వివాదాస్పదం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. సిద్ధిపేట జిల్లా కుక్కునూరుపల్లి మండలం మత్పల్లి గ్రామంలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Ramchander Rao Counter To Congress BRS
Read also: 2026 marriage dates: జూన్ 19 నుంచి ప్రారంభం కానున్న శుభ ముహూర్తాలు
ఇది దేశవ్యాప్త ప్రక్రియ.. పారదర్శకత కోసమే 'ఎస్ఐఆర్'
గతంలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ చేపట్టినప్పుడు బీజేపీ పూర్తి స్థాయిలో సహకరించిందని రాంచందర్ రావు గుర్తు చేశారు. కానీ నేడు విపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. “ఓటర్ల జాబితా సవరణ అనేది కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. కేరళ, కర్ణాటకతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఓటర్లు తమకు ఓటు హక్కు ఉన్న సొంత నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటం, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం” అని ఆయన స్పష్టం చేశారు.
Ramchander Rao: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించిందని, అందుకే ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతున్నారని రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. గతంలో పాలించిన బీఆర్‌ఎస్ సర్కార్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ రెండూ కూడా రైతాంగాన్ని, విద్యార్థులను, నిరుద్యోగులను మరియు ఉద్యోగులను ఘోరంగా వంచించాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
రెండు రాష్ట్రాల్లో పెసా చట్టం అమలుపై నటుడు రాహుల్ రామకృష్ణ దరఖాస్తు

