Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలో అలరిస్తున్న 'తుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2

ఓటీటీలో అలరిస్తున్న 'తుక్రా కే మేరా ప్యార్' సీజన్ 2

వార్త 1 week ago

Tukra Ke Mera Pyar Season 2: హిందీ డిజిటల్ స్క్రీన్‌పై వచ్చిన విభిన్నమైన డ్రామా సిరీస్‌లలో 'తుక్రా కే మేరా ప్యార్' (Tukra Ke Mera Pyar) ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

సంచితా బసు, ధవళ్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్థికపరమైన అంతరాలు ఇద్దరు ప్రేమికులను ఎలా విడదీశాయి, వారి మధ్య ఎలాంటి శత్రుత్వానికి కారణమయ్యాయి అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. ముఖ్యంగా నటన పరంగా సంచితా బసు అందరి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ నుంచి ‘సీజన్ 2’ రూపకల్పన జరిగి, ఈ నెల 19వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సీజన్ నుంచి మొదటి 4 ఎపిసోడ్లను విడుదల చేశారు.

Read Also: Welcome to the Jungle Movie Review: అక్షయ్ కుమార్ భారీ కామెడీ చిత్రం ఎలా ఉందంటే?

 Tukra Ke Mera Pyar Season 2

Tukra Ke Mera Pyar Season 2: కథ

కుల్దీప్ కుమార్ (ధవళ్ ఠాకూర్), శాన్విక చౌహన్ (సంచిత బసు) ప్రాణంగా ప్రేమించుకుంటారు. అయితే డబ్బు, అంగబలం, పీఠం ఉన్న మనోహర్ సింగ్ వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. ఆయన కారణంగా కుల్దీప్ ప్రాణాలకే ప్రమాదం ఉందని గ్రహించిన శాన్విక.. అతడిని రక్షించడం కోసం కుల్దీప్ మనసు విరిగిపోయేలా ప్రవర్తించి దూరం అవుతుంది. ఆ కసితోనే పట్టుదలగా చదివి కుల్దీప్ కలెక్టర్ అవుతాడు. తన అధికారాలను ఉపయోగించి శాన్విక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. కానీ, రాజకీయ, ముఠా కక్షల కారణంగా శాన్విక తన తండ్రిని, భర్తను కోల్పోతుంది. ఈ ఘోరాల వెనుక కుల్దీప్ హస్తం ఉందేమోనని ఆమె తీవ్రంగా అపార్థం చేసుకుంటుంది.

తండ్రి మరణానంతరం శాన్విక ఆయన స్థానంలో రాజకీయాల్లోకి అడుగుపెడుతుంది. ‘సితారా పూర్’ ప్రజలంతా ఆమెను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఈ తరుణంలో శాన్వికపై మనసు పారేసుకున్న ‘కున్వర్’ అనే వ్యక్తి ఆమెకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. అతని దురుద్దేశాన్ని పసిగట్టిన శాన్విక, ఏమీ తెలియనట్టే నమ్ముతున్నట్లు నటిస్తుంది. మరోవైపు శాన్విక కారణంగా తన కూతురు జీవితం ప్రమాదంలో పడుతుందని భయపడిన దద్దూ మహారాజ్, ఆమెను మట్టుబెట్టడానికి స్కెచ్ వేస్తాడు. తన మామగారి మనసులోని ఈ కుట్రను కలెక్టర్ కుల్దీప్ కనిపెడతాడు.

అదే సమయంలో, తాను కలెక్టర్ కావడానికి వెనుక ఉండి రహస్యంగా సహాయం చేసింది శాన్విక అనే నిజం కుల్దీప్‌కు తెలుస్తుంది. గతంలో ఏ పరిస్థితుల వల్ల ఆమె తనకు దూరమైందో తెలుసుకుని కుల్దీప్ ఎంతగానో పశ్చాత్తాపపడతాడు. ఒకవైపు కున్వర్, మరోవైపు దద్దూ మహారాజ్, ఇంకోవైపు శాన్విక కుటుంబానికి నమ్మకస్తుడిగా నటిస్తున్న ‘అంగద్’ నిజస్వరూపాలను కుల్దీప్ ఎలా బయటపెట్టాడు? ఆ తర్వాత ఎదురైన నాటకీయ పరిణామాలు ఏమిటనేదే మిగిలిన కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్.. సాంకేతిక విభాగం

ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులంతా అద్భుతంగా నటించారు. అందరిలోకి సంచితా బసు అభినయానికి వందకు వంద మార్కులు పడతాయి. నిలకడగా, నిబ్బరంగా ఉంటూ ఒంటరి పోరాటం సాగించే యువతిగా ఆమె నటన మెప్పిస్తుంది. టెక్నికల్ పరంగా చూస్తే.. ఫోటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (నేపథ్య సంగీతం) సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉండటం వల్ల ఎక్కడా అనవసరమైన సాగతీత సీన్లు కనిపించవు.

సాధారణంగా సీజన్ 1 హిట్ అయితే సీజన్ 2ను అనవసరంగా సాగదీస్తుంటారు, కానీ ‘తుక్రా కే మేరా ప్యార్’ విషయంలో అలా జరగలేదు. కథను అనేక శాఖలుగా విస్తరించి, బలమైన స్క్రీన్‌ప్లేతో సరికొత్తగా ప్రెజెంట్ చేశారు. వారం వారం విడుదలయ్యే తదుపరి ఎపిసోడ్స్ కూడా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. ప్రేమ, ద్వేషం, ప్రతీకారం, ద్రోహం, పశ్చాత్తాపం లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ముగింపు

సితారాపూర్ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమకథ అనేక మలుపులు తీసుకోవడమే ప్రధాన బలం. ఒకవైపు ప్రేమ ద్వేషంగా మారడం, మరోవైపు అదే ప్రేమ త్యాగంగా రూపాంతరం చెందడం ఇక్కడ కనిపిస్తుంది. ఒకరి పగ, అపార్థాలు తొలగిపోయి మళ్లీ ప్రేమ చిగురిస్తున్న తరుణంలో, మరొకరి ప్రేమ ప్రతీకారంగా మారడం కథను ఆసక్తికరంగా మార్చింది. ఈ మధ్యలో కొత్త శత్రువులు ప్రవేశించడంతో డ్రామా మరింత పీక్స్‌కు చేరింది.

భర్తను కోల్పోయిన శాన్వికను దక్కించుకోవడానికి కున్వర్ వేసే తెలివైన పావులు, శాన్వికను చంపడానికి దద్దూ మహారాజ్ పన్నే వ్యూహాలు సిరీస్‌ను రసవత్తరంగా మార్చాయి. అధికారాలు చేతులు మారడం, నమ్మిన వ్యక్తులే ద్రోహం చేయడం వంటి పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటాయి.

Epaper: epaper.vaartha.com

సమంత ప్రెగ్నెన్సీపై దర్శకురాలు నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha