Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'

ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'

వార్త 2 weeks ago

Uyir Movie: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. అలాంటి ప్రేక్షకాదరణ పొంది, థియేటర్లలో అలరించిన లేటెస్ట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్'.

జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఈ రోజు (ఆగస్టు 4) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. రోషన్ మాథ్యూ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి ఎం. పద్మకుమార్ దర్శకత్వం వహించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Read Also : 'MEGA 158' : చిరంజీవి డ్యుయల్ రోల్ పై క్లారిటీ!

Uyir Movie: కథ.

ఒక నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందిన ఈ కథ ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. కన్నూర్ జిల్లా పరిధిలోని ధర్మడం పోలీస్ స్టేషన్‌కు ప్రొబేషనరీ ఎస్ఐగా అజీబ్ (రోషన్ మాథ్యూ) బాధ్యతలు స్వీకరిస్తాడు. అదే సమయంలో సమీపంలోని కొడువల్లి గ్రామంలోని పాడుబడిన బావిలో ఓ మహిళ మృతదేహం లభిస్తుంది. విచారణలో ఆమె పేరు శోభ అని గుర్తిస్తారు. చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆమె భర్త రాజు కోసం గాలించగా ఓ వ్యక్తి దొరుకుతాడు. శోభ మరొకరితో వెళ్లిపోయిందని, తనకు ఆమెతో సంబంధం లేదని అతడు చెప్పడంతో పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావించి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అయితే అనంతరం స్టేషన్‌కు వచ్చిన శోభ బంధువులు ఫొటోను చూసి, అతను శోభ భర్త రాజు కాదని, అతడి అసలు పేరు భువనేశ్ అని వెల్లడిస్తారు. దీంతో రాజు పేరుతో భువనేశ్ పోలీసులను తప్పుదారి పట్టించాడని, ఇది ఆత్మహత్య కాదు పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని అజీబ్ గ్రహిస్తాడు. ఈ కేసును ఛేదించి భువనేశ్‌ను పట్టుకోవడానికి పైఅధికారులు అజీబ్‌కు కేవలం 24 గంటల గడువు ఇస్తారు. ఆ తర్వాత అజీబ్ ఏం చేశాడు? భువనేశ్ ఎవరు? శోభ అసలు భర్త, పిల్లలు ఏమయ్యారు? అనేది మిగతా కథ.

ఉత్కంఠ రేకెత్తించే ఇన్వెస్టిగేషన్ & కథనం

ఆత్మహత్యగా భావించి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అది హత్య అని తేలితే, ఒక పోలీస్ అధికారి ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడనే ఆసక్తికరమైన కోణంలో దర్శకుడు పద్మకుమార్ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ కేసును హీరో వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగంగా కనెక్ట్ చేస్తుంది. అనవసరమైన హంగామా లేకుండా, వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను తెరకెక్కించడం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అజయ్ డేవిడ్ అందించిన ఛాయాగ్రహణం, మణికందన్ అయ్యప్ప నేపథ్య సంగీతం, రంజన్ అబ్రహం ఎడిటింగ్ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

హత్య వెనుక దాగి ఉన్న రహస్యాలను ఛేదిస్తూ, కీలక ఆధారాలను సేకరించే క్రమంలో కథ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఉయిర్' ఓటీటీలో మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది.

 Crime thriller 'Uyir' has arrived on OTT.

నాని 'ది ప్యారడైజ్' టీజర్ అప్‌డేట్ వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha