Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఓటీటీలోకి  వచ్చేసిన మరో మలయాళ థ్రిల్లర్

ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ థ్రిల్లర్

వార్త 1 week ago

Oru Durooha Sahacharyathil: సాధారణంగా మలయాళం నుంచి వచ్చే క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ లేదా సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు టాలీవుడ్ ఆడియన్స్‌లో కూడా భారీ డిమాండ్ ఉంటుంది.

వారు ఎంచుకునే కథాంశాలు, కథను నడిపించే తీరు చాలా సహజంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అలాంటి థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకుల కోసమే ఈ వారం మలయాళం నుంచి ‘ఒరు దురూహ సాహచర్యత్తిల్’ అనే ఆసక్తికర సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. రితీశ్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందింది.

Read Also: Karuppu Movie: 'కరుప్పు' చిత్రం స్పెషల్ షోలకు తమిళనాడు గ్రీన్ సిగ్నల్!

 Oru Durooha Sahacharyathil, which has entered OTT

కథ, పాత్రలు

ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ కుంచాకో బోబన్ ‘సేతు’ అనే ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. తన ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఒక అటవీ ప్రాంతంలో నివసించాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఒకరోజు ఒక అపరిచిత వ్యక్తి అతనికి తారసపడతాడు. మానవత్వంతో సేతు అతనికి ఆశ్రయం ఇస్తాడు. అయితే, ఆ వ్యక్తి రాకతో సేతు జీవితంలో ఎలాంటి అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి? అతనికి ఎదురైన వింత పరిణామాలు ఏంటి? అనే ఉత్కంఠభరిత అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఇందులో దిలీష్ పోతన్, సాజిన్ గోపు వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రలు పోషించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. కానీ ఒక కండిషన్!

ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. నేటి నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కేవలం మలయాళ భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బాలయ్య సినిమాలో 'హనీ రోజ్' రీఎంట్రీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha