Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం. తండ్రి, కొడుకు మృతి

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం. తండ్రి, కొడుకు మృతి

వార్త 2 months ago

Hyderabad ORR Road Accident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం ఒక నిండు కుటుంబాన్ని చిదిమేసింది. రోడ్డు పక్కన చెట్లకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్‌ను అతివేగంతో వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Read Also:AP Politics: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న బహిరంగ లేఖ!

ఒకే కుటుంబంలో ఇద్దరు బలి

హన్మకొండకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి (37) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బెంగుళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ సమీపానికి చేరుకోగానే, నియంత్రణ కోల్పోయిన కారు ముందున్న వాటర్ ట్యాంకర్‌ను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో:

  • వేద ప్రకాష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
  • ఆయన రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్ కూడా మరణించాడు.

Hyderabad ORR Road Accident: ముగ్గురి పరిస్థితి విషమం

కారులో ఉన్న మిగతా ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

గత కొంతకాలంగా ఔటర్ రింగ్ రోడ్డుపై నీళ్లు పోసే ట్యాంకర్ల విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha