Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

శంషాబాద్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి గుట్టురట్టు!

వార్త 2 months ago

Fake CISF Officer Arrested Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టులో పో నకిలీ సిఐఎస్ఎఫ్ అధికారి బాగోతం బట్టబయలైంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటన సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి….

శంషాబాద్ ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి హల్చల్ చేస్తూ ఓ వ్యక్తి అనుమానాస్పరిస్థితిలో కనిపించగా పోలీసులు అతని ఆదుపులోకి తీసుకొని విచారించారు. సదరు వ్యక్తి ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఇతను ఖరీదైన యూనిఫామ్ దుస్తులు ధరించి తను సిఐఎస్ఎఫ్ అధికారిగా చలమనవతు వచ్చాడు. ఇతని ప్రవర్తన పై అధికారులకు అనుమానం ఏర్పడడంతో వలవేసి పట్టుకున్నారు.

Read Also:AP Inter Results 2026: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!

Fake CISF Officer Arrested Shamshabad Airport: 67 మంది యువతులకు వల

ఇదిలా ఉండగా, ఇతని నేరచరిత్రను పరిశీలించగా, విస్తూపోయే నిజాలు వెలుగు చూసాయి. దాదాపు 67 మంది యువతులకు తన ఫోటోలను మ్యాట్రిమోనీ సెంటర్లలో అప్లోడ్ చేసి పంపడం జరిగింది. వారు ఇతని ఖరీదైన దుస్తులు, మోసపు మాటలు నమ్మారు. నగలు ,నగదు వారి నుంచి వసూలు చేసుకోవడం పారిపోవడం ఇతనికి పరిపాటిగా మారింది. ఎటకేలకు పోలీసులకు చిక్కడంతో గుట్టు రట్టయింది. మ్యాట్రిమోనీలో యువతులు ఎలాంటి మోసగాళ్ల వలలో పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. నిందితుడు నుంచి ఖరీదైన దుస్తులు, సిఐఎస్ఎఫ్ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఎంపీ బైరెడ్డి శబరి పీఏ మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha