ప్రమాదాలు, రోడ్ల ధ్వంసం అడ్డుకట్టకు కేంద్రం కీలక నిర్ణయం
Toll Plaza New Rules: కేంద్రప్రభుత్వం ఓవర్లోడ్ వాహానాలతో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను అడ్డుకోవడంతోపాటు రోడ్ల ధ్వంసం నిలువరించేందుకు జాతీయ రహదారులపై ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించడం మొదలు పెట్టింది.
జాతీయ రహదారులపై ఓవర్లోడుతో వెళ్లే వాహనాల నిబంధనల అమలును పటిష్టం చేయడానికి జరిమానాలను కేంద్ర రోడ్డు రవాణా. రహదారుల మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ కొత్త నిబంధనలు గత ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
Read Also : Telangana Fuel Supply: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కీలక ప్రకటన!
Heavy toll fees for overloaded vehicles
Toll Plaza New Rules: కొత్త టోల్ రూల్స్
జాతీయ రహదారులపై అధిక లోడ్తో ప్రయాణిస్తున్న వాహనాలతో ప్రమాదాలు అధికమవడం, రోడ్లు ధ్వంసం అవుతుం డటంతో కేంద్ర ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ కొత్త నిబంధన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే వర్తించనున్నాయి. నిర్దేశించిన లోడు పరిమితులను పాటించడాన్ని ప్రోత్సహించడం, రహదారికి మౌళిక సదుపాయాలను పరిరక్షిస్తూ రోడ్డు భద్రత పెంచడం ఈ నిబంధనల లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ఛానిస్తోంది.
ఓవర్ లోడ్ బట్టి రుసుము
ఇక టోల్ను వాహనాలకు బోడు శాతం బట్టి రుసుము విధించనున్నారు. 10 శాతం వరకు ఓవర్ లోడుతో వెళ్లే వాహనాలకు ఎటువంటి రుసుము చెల్లించనవసం లేదు. 10 నుంచి 40 శాతం వరకు ఓవర్ లోడుతో వెళ్లే వాహనాలకు ప్రాధమిక రుసుముకు రెట్టింపు ఫీజు విధించనున్నారు. 40 శాతం పైగా ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాలకు ప్రాథమిక రుసుముకు నాలుగు రెట్లు అధికంగా ఫీజు వసూలు చెయ్యనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనాల వివరాలను జాతీయ వాహన రిజస్టర్ పోర్టల్ లో నమోదు చేస్తారు.
టోల్ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన సర్టిఫైడ్ తూకం యంత్రాలను ఉపయోగించి వాహనాల వద్ద ఓవర్ లోడింగ్ నిర్ధారిస్తారని కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆదేశాలలో పేర్కొంది. ఫీజు వసూలు చేసే టోల్ ప్లాజాల వద్ద తూకం వేసే సదుపాయాలు అందుబాటులో లేనట్లయితే ఓవర్ బోడ్ ఫీజు చెల్లించనవసరం లేదు. ఫీజు కేవలం ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలు చేస్తారు. లోడు వాహనాలు వెళ్లేటప్పుడు టోల్ ప్లాజాల వద్దే తూకం యంత్రాలను ఉపయోగించాలని జాతీయ రహదారుల్లోని అన్ని టోల్ ప్లాజాలకు ఆదేశాలు కూడా వెళ్లాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

