Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

వార్త 6 days ago

KBR Park: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ పచ్చదనం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్క్ చుట్టూ 35 మీటర్ల పరిధిలో ఉన్న ఒక్క చెట్టును కూడా తొలగించకూడదని స్పష్టం చేసింది.

పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Uppal Ring Road: హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఉప్పల్ రింగ్ రోడ్డు 3 నెలలు బంద్!

 KBR Park Greenery Protection SC Stay

KBR Park: నిలిచిపోయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు

నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్ పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం పార్క్ పరిసరాల్లో చెట్లు తొలగించాలని భావించగా కోర్టు స్టే విధించింది. దీంతో ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి.

జూలై 27న తదుపరి విచారణ

ఈ వివాదంపై పూర్తి వివరాలు పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చెట్లు కొట్టకూడదని కచ్చితమైన నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha