Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాదాల్లో తిమ్మిర్లా? విటమిన్ బి-12 లోపం కావచ్చు!

పాదాల్లో తిమ్మిర్లా? విటమిన్ బి-12 లోపం కావచ్చు!

వార్త 3 weeks ago

Health Tips: మన శరీరంలోని అంతర్గత ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి పాదాలు అద్దంలా పనిచేస్తాయి. పాదాల్లో వచ్చే చిన్నపాటి మార్పులు కూడా భవిష్యత్తులో రాబోయే పెద్ద ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చు.

అందుకే పాదాలను కేవలం నడవడానికే కాకుండా, ఆరోగ్య సూచికలుగా కూడా గమనించడం అవసరం.

వాపులు ఉంటే జాగ్రత్త!

పాదాలు లేదా చీలమండల భాగంలో తరచూ వాపులు వస్తుంటే అది కేవలం అలసట మాత్రమే కాకపోవచ్చు. ఇది కిడ్నీ (మూత్రపిండాలు), గుండె లేదా కాలేయ సంబంధిత సమస్యలను సూచిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగినప్పుడు కూడా పాదాల్లో వాపు కనిపిస్తుంది.

Read Also: Neredu Pandu Benefits: నేరేడు పండుతో ఇన్ని లాభాలా? అయితే ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్యలు తప్పవు!

తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు ఉండటం

పాదాల్లో తరచూ తిమ్మిర్లు రావడం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంటే.. అది మీ నాడీ వ్యవస్థ దెబ్బతిన్నదనడానికి సంకేతం. ఇది ప్రధానంగా మధుమేహం (డయాబెటిస్) లేదా శరీరంలో విటమిన్ బి-12 లోపాన్ని తెలియజేస్తుంది.

Health Tips: రంగు మారడం, వేడి

పాదాలు ఎర్రగా మారి, తీవ్రమైన వేడిని కలిగి ఉంటే అది ‘గౌట్’ వ్యాధికి చిహ్నం కావచ్చు. అలాగే చర్మం కింద రక్తనాళాలు నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తుంటే.. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదని అర్థం చేసుకోవాలి.

చల్లని పాదాలు.. పొడిబారిన చర్మం

పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటుంటే అది రక్తహీనత (Anemia) లేదా రక్త ప్రసరణ లోపాలకు సంకేతం. అదేవిధంగా, పాదాల చర్మం విపరీతంగా పొడిబారిపోయి కనిపిస్తుంటే అది థైరాయిడ్ సమస్య లేదా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం (డీహైడ్రేషన్) వల్ల సంభవించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

వేసవిలో బార్లీ నీటితో ఆరోగ్య లాభాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha