Benefits of Barley Water: ఎండలు ముదురుతున్న వేళ శరీరాన్ని చల్లబరుచుకోవడం అత్యవసరం. వేసవిలో మన శరీరం త్వరగా డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం)కు గురవుతుంది.
ఇలాంటి సమయంలో కేవలం మంచి నీటితోనే కాకుండా, పోషక విలువలున్న ద్రవ పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అందులో 'బార్లీ నీరు' అత్యంత ప్రభావవంతమైన పానీయంగా నిలుస్తుంది. బార్లీలో ఉండే ఔషధ గుణాలు శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడమే కాకుండా, ఎండల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి.
బార్లీ నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన క్యాల్షియం, ఐరన్, జింక్ మరియు రాగి వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా అందుతాయి. వీటితో పాటు విటమిన్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో కోల్పోయే పోషకాలను తిరిగి పొందేందుకు ఇది ఒక సహజసిద్ధమైన మార్గం.
ad Also: Chia Seeds: చియా గింజలతో వేసవి తాపానికి చెక్!
Barley, the elixir that protects health in summer: A check for dehydration and gas problems!
జీర్ణవ్యవస్థకు మేలు
తరచుగా బార్లీ నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. ముఖ్యంగా ఎండల వల్ల వచ్చే కడుపులో మంట, ఎసిడిటీ మరియు గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో బార్లీ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను (టాక్సిన్స్) బయటకు పంపి, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి కూడా బార్లీ నీరు ఎంతో మేలు చేస్తుంది.
బీపీ, షుగర్ నియంత్రణలో..
మధుమేహం (Diabetes), రక్తపోటు (BP) సమస్యలతో బాధపడేవారికి బార్లీ నీరు ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ రోజువారీ ఆహారంలో బార్లీ నీటిని చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

