Pok: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. స్థానిక ఆర్థిక, రాజకీయ హక్కుల కోసం పోరాడుతున్న 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC) పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో ప్రాంతమంతా రణరంగంగా మారింది.
నిరసనకారులకు, ప్రభుత్వ భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘోర ఘర్షణల్లో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ArmyFiring
Read also: Bear terror in Japan: విధుల్లో ఎలుగుబంటి విహారం.. అలర్ట్ అయిన సర్కార్..!
ఆసుపత్రి వద్ద మొదలైన ఘర్షణ - కాల్పుల కలకలం
పోలీసుల కథనం ప్రకారం.. అంతకుముందు జరిగిన కాల్పుల్లో మరణించిన తమ సహచరుడి మృతదేహం ఉన్న ఓ ఆసుపత్రి మార్చురీ వెలుపల జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యులు భారీగా గుమిగూడారు. అక్కడ పరిస్థితి చేతులు దాటిపోతుండటంతో, గుంపును చెల్లాచెదురు చేసేందుకు భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో సైన్యంపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు చట్ట అమలు సంస్థలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నిరసనకారులు మరణించారని పూంచ్ సెక్టార్ రీజినల్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ధృవీకరించారు.
Pok: అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
రాబోయే శాసనసభ ఎన్నికల సీట్ల కేటాయింపే ఈ తాజా హింసాకాండకు ముఖ్య కారణం. అసెంబ్లీలో మొత్తం 45 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు జులై 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో శరణార్థుల కోసం 12 స్థానాలను రిజర్వ్ చేయడాన్ని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఈ రిజర్వేషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సమ్మెలు, నిరసనలు చేపట్టారు. ఇది కాస్తా పరస్పర కాల్పులు, హింసాత్మక ఘర్షణలకు దారితీసి భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది.
పాక్ ఆర్మీ ఉక్కుపాదం - అంతర్జాతీయ ఆందోళన
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలో ఈ తిరుగుబాటుపై అణచివేత చర్యలు తీవ్రమయ్యాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఉద్యమాన్ని తమ ఉనికికే పెద్ద రాజకీయ సవాలుగా భావిస్తున్న సైనిక యంత్రాంగం, ఎన్నికల కంటే ముందే ఇక్కడి నిరసన స్వరాలను పూర్తిగా నొక్కేయాలని చూస్తోంది.
గత 2024, 2025 సంవత్సరాల్లో జరిగిన దాడుల తరహాలోనే ప్రస్తుత సైనిక అణచివేత కూడా సాగుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. PoKలో జరుగుతున్న ఈ నరమేధంపై తక్షణమే స్వతంత్ర దర్యాప్తు జరపాలని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:
అమెరికా నేషనల్స్ ఆవిష్కరణల పోటీలో టాంపా తెలుగమ్మాయికి ద్వితీయ బహుమతి!

