Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాక్ దౌత్య వైఫల్యం: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం..కారణం ఇదేనా?

పాక్ దౌత్య వైఫల్యం: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం..కారణం ఇదేనా?

వార్త 2 months ago

ప్రపంచ శాంతి కోసం జరిగిన ప్రయత్నాలు పాకిస్థాన్ చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల బెడిసికొట్టాయి. క్రెడిట్ కోసం పాక్ ఆడిన 'డబుల్ గేమ్' ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారింది.

మధ్యవర్తిగా వ్యవహరించే దేశం రెండు పక్షాల మధ్య స్పష్టమైన సమాచారాన్ని చేరవేయాలి. కానీ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇరాన్‌ను ఒప్పించే క్రమంలో లెబనాన్‌పై దాడుల అంశాన్ని ఒప్పందంలో చేర్చినట్లు తప్పుడు సంకేతాలిచ్చారు. అయితే అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావనే లేదని జెడి వాన్స్ స్పష్టం చేయడం పాక్ ద్వంద్వ నీతిని బయటపెట్టింది.

Read Also: Iran-USA War: ఇస్లామాబాద్ చర్చలకు రంగం సిద్ధం..జేడీ వాన్స్ నాయకత్వం

 Iran-America War

Iran-America War: హర్ముజ్ జలసంధి పునః మూసివేత

ఒప్పందం కుదిరిందన్న ఆనందం ఆవిరి కావడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తన మాట తప్పిందని భావించిన ఇరాన్, వెంటనే హర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ మార్గం నుంచే జరుగుతుంది కాబట్టి, పాక్ చేసిన పొరపాటు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీసేలా ఉంది.

‘డ్రాఫ్ట్’ ట్వీట్ వివాదం – సోషల్ మీడియా ట్రోల్స్
గతంలో పాక్ ప్రధాని ఒక ప్రకటన చేస్తూ ‘డ్రాఫ్ట్’ అనే పదాన్ని పొరపాటున ట్వీట్‌లో ఉంచారు. ఇది అమెరికా పంపిన స్క్రిప్ట్‌ను పాక్ కేవలం కాపీ-పేస్ట్ చేసిందని విమర్శలకు దారితీసింది. ఇప్పుడు లెబనాన్ విషయంలో జరిగిన పొరపాటు కూడా పాక్ సొంతంగా ఏమీ చేయలేదని, కేవలం క్రెడిట్ కోసం ఆరాటపడిందని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. ఈ ఘటనతో అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ నమ్మకాన్ని కోల్పోయింది. ఒకవైపు అమెరికాతో ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తూ, మరోవైపు ఇరాన్ లాంటి పొరుగు దేశంతో సంబంధాలు కాపాడుకోవాలని చూస్తూ పాక్ చేసిన ‘సర్కస్’ విఫలమైంది. ఫలితంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

    Read Also hindi news: hindi.vaartha.com

    Epaper : epaper.vaartha.com

    Read Also:

    భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ చిగురిస్తున్న మైత్రి

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha