Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్తాన్‌తో ఫైనల్‌.. అభిషేక్ శర్మ విధ్వంసం

పాకిస్తాన్‌తో ఫైనల్‌.. అభిషేక్ శర్మ విధ్వంసం

వార్త 3 weeks ago

Asian games cricket 2026: ఆసియా క్రీడలు-2026 క్రికెట్ పోటీల్లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం స`ష్టించాడు.

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దాయాది బౌలర్లను అభిషేక్ ఉతికారేశాడు. తన ఓపెనింగ్ భాగస్వామి వైభవ్ సూర్యవంశీ త్వరగా ఔటైనప్పటికి అభిషేక్ మాత్రం తన తుపాన్ బ్యాటింగ్‌తో వీరవిహారం చేశాడు.

Pranavi Golf: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. చరిత్ర సృష్టించిన ప్రణవి

ఈ క్రమంలో అతడు కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొన్న అభిషేక్‌.. 3 ఫోర్లు, 7సిక్స్‌లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. తద్వారా అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

అభిషేక్ శర్మ సాధించిన అరుదైన రికార్డులు ఇవే

టీ20ల్లో అత్యంత వేగంగా 400 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా అభిషేక్‌ రికార్డు పుటలకెక్కాడు. కేవలం 208 ఇన్నింగ్స్‌ల్లో శర్మ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన రెండో ప్రపంచ బ్యాటర్‌గా నిలిచాడు.

651 బంతుల్లో అభిషేక్ ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ (11 సిక్సర్లు) రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు. అభిషేక్ ఇప్పటివరకు పాక్‌పై 14 సిక్సర్లు బాదాడు.

భారత్ భారీ స్కోర్‌

ఇక ఫైనల్ మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ(61) టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(51), శివమ్ దూబే(27) రాణించారు. పాక్ బౌలర్లలో అహ్మద్ దనియల్, అరఫత్ మిన్హాస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

SRHను వీడనున్న అభిషేక్ శర్మ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha