Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్‌ పోలీసుల కాల్పుల్లో ఆస్ట్రేలియా చిన్నారి మృతి

పాకిస్థాన్‌ పోలీసుల కాల్పుల్లో ఆస్ట్రేలియా చిన్నారి మృతి

వార్త 2 weeks ago

Pakistan: ఆస్ట్రేలియా నుంచి పాకిస్థాన్‌కు విహారయాత్రకు వచ్చిన ఓ ప్రవాస కుటుంబం తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. పంజాబ్ ప్రావిన్స్‌లోని చక్వాల్ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో వారి కారును సాయుధ దొంగల ముఠా అడ్డగించింది.

ఆ తర్వాత కుటుంబాన్ని బందీలుగా తీసుకున్నట్లు సమాచారం.

Read also: Modi - Trump Meeting : ఈరోజు సాయంత్రం మోదీ-ట్రంప్ కీలక భేటీ

దోపిడీ ముఠాపై పోలీసుల ఆపరేషన్

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో దొంగలు పోలీసులపై కాల్పులు జరపడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కూడా ప్రతిగా ఎదురుకాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల సమయంలో ఓ పోలీస్ అధికారి దొంగల వాహనాన్ని లక్ష్యంగా చేసుకోవాలనుకుని, పొరపాటున బాధితుల కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల ఆస్ట్రేలియా బాలిక హనియా అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Pakistan: కుటుంబ సభ్యులు గాయపడి చికిత్సలో

ఈ ఘటనలో బాలిక తండ్రి అదీల్ అహ్మద్ (39), అన్నయ్య ఆఫాన్ అహ్మద్ (11) తీవ్రంగా గాయపడ్డారు. తల్లి డాక్టర్ సిద్రా ఖాన్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పెర్త్‌లోని ఆస్ట్రేలియన్ ఇస్లామిక్ కాలేజీలో చదువుతున్న చిన్నారి మృతిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆయన పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, నిర్లక్ష్యంగా కాల్పులు జరిపిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి, హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మూడు నెలల కనిష్ఠానికి క్రూడాయిల్ ధర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha