Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాల ఉత్పతి లేకుంటే మనుగడ కష్టం..జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

పాల ఉత్పతి లేకుంటే మనుగడ కష్టం..జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వార్త 2 weeks ago

Sangareddy News: కలెక్టర్ ప్రతీక్ జైన్ మానవాళికి పశు సంపద అత్యంత కీలకమని, పాల ఉత్పత్తి లేకుండా మనుగడ కష్టతరమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

సంగారెడ్డి జిల్లా చౌటకూల్ మండలం సరాఫ్పల్లి గ్రామంలో పశు వైద్య, సంవర్థక శాఖ అధ్వర్యంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సర్పంచ్ నందికంటి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ పశు సంపద పెంపుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలు ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డారని, ఇంటికో పాడి గేదె ఉండేలా చొరవ చూపాలని సూచించారు. ఇంట్లో పాడి గేదెల ఉండటం ద్వారా పాలు, పెరుగు, నెయ్యి, ఇతరాత్ర పశు ఉత్పత్తులను లభ్యమవుతాయన్నారు.

Read Also:Sangareddy News: వర్షాల నేపథ్యంలో వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Sangareddy News: ఎక్కడి నుంచో పాల ప్యాకెట్లు సరఫరా చేస్తే వాటిని కొనుగోలు చేస్తున్నామని, దీనికి ప్రజలు స్వస్తి పలికి మునుముందు ఇంటింటికి పాడి పశువులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాడి గేదెల ద్వారా తమ ఇంటి అవసరాలు తీర్చడమే కాకుండా రోజు ఆదాయ వనరులవుతాయన్నారు. గ్రామీణ ప్రాంత రైతులకు పశు సంపద పెంపుదల చాలా సులభతరంగా చేపట్టవచ్చని. ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వమే ఉచితంగా పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేస్తుందని, ఇందులో రైతులు పెద్దగా ఆర్థిక భారం భరించాల్సిన అవసరం లేదన్నారు. పశు వైద్యాధికారులు వారానికి, పక్షం రోజులకు ఇంటికి వచ్చి పశువుల ఆరోగ్యం, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంటారని. తెలియజేశారు. ఆరోగ్యకరమైన మేలు జాతి దూడలను ఎంచుకుని పశు సంపదను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఆసక్తి గల రైతులు పశు సంపద అభివృద్ధిపై దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.

ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జేడీ వసంతకుమారి, డీఏవో శివప్రసాద్, డీసీవో కిరణ్ కుమార్, తహసీల్దార్ నామాల కిష్టయ్య, ఏవో ప్రవీణ, ఆరో ప్రమోద్కుమార్, ఎంపీవో సువర్ణ, పశు వైద్యాధికారి విశాల్, గోపాల మిత్ర పర్యవేక్షకులు అర్జునయ్య, మత్స్య శాక అధ్యక్షుడు వెంకటేశం, మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్, విజయ డైరీ ఇంచారి మేనేజర్ నిఖిత, సిబ్బంది శంకర్, ప్రభాకర్ పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఒకరిని కాపాడబోయి ముగ్గురు బావిలో పడి దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha