Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాల నేపథ్యంలో వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వర్షాల నేపథ్యంలో వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వార్త 3 months ago

Sangareddy News: సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలంలోని సరాఫ్‌పల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులకు పశువుల పోషణ, సంరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 12 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

Read aslo: Water Crisis in Hyderabad: హైదరాబాద్‌లో అడుగంటిపోతున్న భూగర్భ జలాలు

Sangareddy News: వరి కొనుగోళ్లు వేగవంతం చేయాలి

రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి నిల్వ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు అనంతరం 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు తమ సమస్యలు, ఫిర్యాదులను ఆ నంబర్ ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో భారీ మార్పులు.. ఇకపై నేరుగా మీ ఖాతాలోకే డబ్బులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha