Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలమూరులో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు

పాలమూరులో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు

వార్త 2 months ago

348 కవులతో సంచిక ప్రచురించి తెలంగాణ ఖ్యాతిని చాటిన మహనీయుడు: విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Palamuru news: పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా సురవరం ప్రతాపరెడ్డి జయంతి తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి సల్పిన మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గురువారం పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి జయంతోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పత్రికా సంపాదకుడిగా పరిశోధకుడిగా పండితుడిగా రచయితగా క్రియాశీల ఉద్యమకారుడిగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి ఎనలేనిదని తెలిపారు. తెలంగాణలో 348 కవులతో కూడిన గోల్కొండ కవుల సంచిక గ్రంధాన్ని కవుల జీవిత విశేషాలతో ప్రచురించి తెలంగాణ ఖ్యాతిని చాటిన మహనీయుడు సురవరం అని, విమర్శకులకు సమాధానం ఇచ్చిన గొప్ప కవి అని తెలిపారు. గోల్కొండ పత్రిక స్థాపించి సంపాదకుడిగా పత్రిక రచయితగా ప్రసిద్ధి చెందాడు.

Read also: Mancherial News: జూన్ 6 వరకు ధాన్యం కొనుగోళ్లు: రైతులకు మంత్రి వివేక్ భరోసా!

 Suravaram Pratapareddy’s Birth Anniversary

Palamuru news:ఘనంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగు ప్రజలను చైతన్యపరచిన గొప్ప కవి సురవరం అని, సురవరం రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించిందని, వీరి రచనల ద్వారా ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొందాలని వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ గుమ్మాల మమత, టి పి సి సి కార్యదర్శి ఏ. పీ. మిథున్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం. సురేందర్ రెడ్డి, ముడ చైర్మన్ లక్ష్మణ్, గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, స్థానిక కార్పొరేటర్ మర్రి జ్యోతి, రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు తూము ఇంద్రసేనా రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరు రాజేందర్ రెడ్డి, కోశాధికారి మల్లు నరసింహ రెడ్డి, కార్యదర్శి కోటేశ్వర్ రెడ్డి, సభ్యులు పరమేశ్వర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సరస్వతి, వరలక్ష్మి, రమ న్యాయవాది మనోహర్ రెడ్డి, పొద్దుటూరి ఎల్లా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తదనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి విగ్రహానికి పూలమాల సమర్పించి వారి గురించి మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మెదక్ నవాబుపేట ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha