Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెదక్ నవాబుపేట ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనలు

మెదక్ నవాబుపేట ఈద్గా వద్ద బక్రీద్ ప్రార్థనలు

వార్త 2 months ago

Medak Bakrid prayers: మెదక్ పట్టణంలోని నవాబుపేట ఈద్గా వద్ద బక్రీద్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో ముస్లింలు ఈద్గా ప్రాంగణానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు శాంతి, సామరస్యం, సోదరభావం, దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక దువాలు చేశారు. బక్రీద్ పండుగ త్యాగానికి, మానవత్వానికి ప్రతీక అని పేర్కొంటూ సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం పెంపొందాలని సందేశం ఇచ్చారు.

Read Also : Devagiri Express cash seized: దేవగిరి ఎక్స్ ప్రెస్ లో రూ. కోటి 22 లక్షల నగదు సీజ్

 Bakrid prayers at Medak Nawabpet Eidgah

Medak Bakrid prayers: ప్రార్థనల అనంతరం బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరులు

ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఈద్గా ప్రాంగణం సందడిగా మారింది. భక్తుల రద్దీ దృష్ట్యా స్థానిక అధికారులు, పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు ముగిశాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వసుధైక కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి : కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha