Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాలనలో నెహ్రూను దాటిన మోడీ

పాలనలో నెహ్రూను దాటిన మోడీ

వార్త 4 days ago

PM Modi : జవహర్లాల్ నెహ్రూ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని కైన తొలి ప్రధానమంత్రిగా 1952 మే 13న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి నుంచి 1964 మే 27న కన్నుమూసే దాకా 4,397 రోజులపాటు అవిచ్ఛిన్నంగా ఆ పదవిలో కొనసాగారు.

ఆయన 1947 ఆగస్టు 15 నుంచే ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించిన రాజ్యాంగ సభకు బాధ్యత వహించే మధ్యం తర ప్రభుత్వ అధిపతిగా మాత్రమే ఉన్నారనే వాస్తవం రాజ్యాంగ చరిత్రను నిశితంగా అధ్యయనం చేసేవారికి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 4,398 రోజులు ఆ బాధ్యతలలో కొనసా గడం ద్వారా నేడు నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. మన దేశానికి సుదీర్ఘకాలం ప్రధానమంత్రులుగా పనిచేసిన మోడీ, నెహ్రూల పాలన శైలి పూర్తిగా భిన్నం. బాల్యం నుంచీ పెంపకం, ఆలోచన విధానం, విశ్వాసాలు, స్వభావం, పనితీరు శైలి, విలువల పంథా సహా రాజకీయ సిద్ధాంతాల రీత్యా ఇద్దరి ప్రస్థానం పరస్పర విరుద్ధం. నెహ్రూ ఒక సంపన్న బారిస్టర్ కుమారుడు, బ్రిటిష్ రాచబిడ్డలు చదివే హారో,
కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాలల్లో చదివారు. అయితే, బాల నరేంద్రుడికి అలాంటి విలాస జీవితం కలలోమాటే… రైల్వే స్టేషన్లో ఓ చిన్న టీ కొట్టు నడిపే తండ్రి నీడన, ఐదుగురు తోబుట్టువులతో కలిసి మోడీ పెరిగారు. కనీసం కరెంటు సౌకర్యం కూడా లేని, చీకటి రాజ్యం చేసే చిన్న ఇంట్లో, తిండికి కూడా తిప్పలు పడాల్సిన దుస్థితిలో వారి జీవనం సాగేది. ఆ పరిస్థితుల నడుమ మాతృభాషలోనే.. నాణ్యత మాటెరుగని సాధారణ విద్యను అభ్యసించారు. ఆ రోజుల్లో వారికి రేడియో లేదా వార్తాపత్రికలు అందుబాటు లో లేవు. మోడీ కుటుంబానికి టూత్ పేస్టుబ్రష్షు, స్నానపు గదిషవర్ వంటి సౌకర్యాల మాట అటుంచి, కనీసం మరుగు దొడ్డి, కొళాయి నీటి సరఫరా సౌకర్యం కూడా ఉండేవికావు. అలాంటి జీవితం గడిపిన ఆయన, తన 17వ ఏట వ్యక్తిగత ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టి, ఇల్లు వదిలివెళ్లారేగానీ, మళ్లీ రానే లేదు! తన తల్లి గాజు పెంకులు కలిపిన బూడిద తో ఇతరుల ఇళ్లలో పాత్రలు కడుగుతుండగా ఆమె వేళ్లు రక్తం చిందడాన్ని చెమ్మగిల్లిన కళ్లతో బాల నరేంద్రుడు చూస్తూండి పోయేవాడు.

Read Also : NDA Meet Today: ఢిల్లీలో ఎన్డీయే మహా సదస్సు.. 22 రాష్ట్రాల సీఎంలతో భారత్ మండపం వేదికగా మోదీ 'విజయగీతం'!

 PM Modi

PM Modi : నెహ్రూకు చైనీయులపై నమ్మకం

నెహ్రూ విలక్షణ ఇంగ్లీష్ ఉచ్చారణ శైలి చూసి చేరువైన ఉన్నత వర్గాలవారు ఆయనను తమలో ఒకడుగా పరిగణించేవారు. స్వీయ అంతర్జాతీయ ప్రతిష్టపై అత్యంత శ్రద్ధ చూపే నెహ్రూ, మాతృభూమిని తన అస్పష్ట ఫేబియస్ ప్రబోధిత సామ్యవాద విశ్వాస కోణంలో చూడ టం వల్ల భారత దేశం భారీమూల్యం చెల్లించాల్సి వచ్చింది. భారత్లో కశ్మీర్ విలీనం ప్రక్రియను ఆయన అమితాలస్యం చేశారు. పైగా అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తా మని కూడా హామీ ఇచ్చారు. అటుపైన సమస్యను ఐక్యరాజ్య సమితి స్థాయికి తీసుకువెళ్లారు. ఇది చాలదన్నట్లు పాక్ దురా క్రమణతో ఆక్రమిత కశ్మీర్గా మారిన ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న భారత సైన్యానికి అనుమతి నిరాక రించారు. చైనీయులపై అమాయకత్వంతో కూడిన ఆయన నమ్మకం వ్యూహాత్మక అక్సాయ్చిన్ ప్రాంతం కోల్పోవడానికి దారితీసింది. మరోవైపు అదొక బంజరు నేల అంటూ నిర్ల క్ష్యంగా కొట్టి పారేశారు. అత్యంత ఏకపక్ష సింధు జలాల ఒప్పందంపై సంతకంతో ఆ. నదీజలాల్లో 80 శాతాన్ని పాకి స్థాన్ పరం చేయడమేగాక, కొన్ని బకెట్ల నీటి కోసం ఇంత రాద్ధాంతం ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించా రు.

మోడీ జిజ్ఞాస అపారం

ఈ పరిణామాల నేపథ్యంలో 72 ఏళ్ల తర్వాతభారత పాల నాధికార పగ్గా లు చేపట్టిన మోడీ కశ్మీర్ ప్రత్యేకహోదా రద్దు ద్వారాఅసాధ్య మని భావించిన ఒక రాజ్యాంగ అద్భుతా న్ని సుసాధ్యం చేసి చూపారు. అప్పటి వరకూ పాకిస్థాన్ ఈ అంశానొక ఉపకరణంగా మార్చుకుని అంతర్జాతీయ వేదిక లపై రభస చేస్తూం డేది. ఇదే తరహాలో ఒక సాహసోపేత నిర్ణయంతో సింధునదీ జలాల ఒప్పందాన్ని స్తంభింపజేసి, శత్రుదేశాన్ని ఆయన చావు దెబ్బకొట్టారు. ముందుచూపుతో కూడిన, ఆచితూచి స్పందించే సైనిక వ్యూహంతో దేశ సరిహద్దులను సురక్షితం చేశారు. వరుస తరాల అధికార యంత్రాంగం అభిప్రాయం ప్రకారం ఏవిష యాన్నైనా మోడీ అద్భుతమైన వేగంతో ఆక ళింపు చేసుకుంటారు. ఆయన జిజ్ఞాస అపారం. అందుకే, ఏది చెప్పినా చెవియొగ్గి వింటారు. అత్యంత సూక్ష్మస్థాయి లో వివరాలను విశ్లేషిస్తారు. నిరంతర పర్యవేక్షణ మదింపు తర్వాత స్థిరమైన నిర్ణయం తీసుకోవడం ఆయన నైజం. సరైన సన్నద్ధత లేని, ఉదాసీన ధోరణి గలవారికి ఆయన దగ్గర అస్సలు చోటుండదు. అయితే, తన సమక్షంలో వివ రాలు ఏకరవు పెట్టడం నెహ్రూకు విసుగు తెప్పించేది. చంచల స్వభావి కావడంతో భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం ఆయన అలవాటుగా ఉండేది. ఒక అభిప్రాయానికివస్తే, మొండిగా దాన్ని సమర్థించుకునే ఓ సాధారణ పరిపాలకుడు. ఆయనను అమితంగా ఆరాధించే జేఆర్డీ టాటా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక శాస్త్రంపై చర్చ మీద నెహ్రూకు -ఎంతమాత్రం ఆసక్తి ఉండేది కాదన్నా రు. అలాంటి సందర్భాల్లో ఆయన కిటికీలో నుంచి తోటలో గంతులేస్తున్న జెయింట్ పాండా (ఎలుగుబంటి లాంటి జంతువు) ను చూస్తూండే వారని చెప్పారు.

దేశంలో విప్లవాత్మక మార్పులు

అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయికి చేర్చే నిబద్ధతకు బదులు సోవియట్ యూనియన్ తరహా పంచవర్ష ప్రణాళిక విధానాన్ని అనుస రిస్తూ భూసంస్కరణలు, జలాశయాల నిర్మాణం, భారీ పరిశ్ర మల ఏర్పాటుకు నెహ్రూ ప్రాధాన్యమిచ్చారు. అయితే, పేద రిక నిర్మూలన దిశగా శాస్త్రీయ దృక్పథంతో మతాతీత, సమర్థ సంక్షేమ పాలన విధానాలను అనుసరించిన మోడీ, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వీటన్నిటికీ వివరిస్తే దళా రుల బెడద తప్పించి నిరుపేదలకు నేరుగా నగదు బదిలీ, వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా, ఇంటింటికీ తాగునీటికొళాయి, పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రత్యక్ష సాయం, పేదలకు ఆరోగ్య బీమా, జన్ ధన్ బ్యాంక్ ఖాతాలద్వారా ఆర్థిక సార్వజననీత, మాతృత్వ సంక్షేమం లక్ష్యంగా నగదుసహాయం, పారిశుధ్యం ఇలా ఈ జాబి తాకుఅంతూదరీ ఉండదు. ఇక కోడ్ 19 సంక్షోభ సమయాన ఏకోన్ముఖ ప్రభుత్వంపద్ధతిని నిక్కచ్చిగా అనుసరిస్తూ అత్యంత నిర్దిష్టసమయానికి సంపూర్ణదిగ్బంధం (లాక్ డౌన్) విధించడం ద్వారా అస్తిత్వ సంక్షోభం నుంచి దేశాన్ని ఒంటిచేత్తో రక్షించారు. ఒక్కమాటలో చెబితే నెహ్రూ ఒక అస్పష్ట తార్కిక సిద్ధాంతకర్త కాగా, మోడీ ఒక అద్భుత పాలనాదక్షుడు నాస్తికుడినని స్వయంగాచాటుకున్ననెహ్రూ, పునర్నిర్మిత సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పతి రాజేంద్ర ప్రసాద్ హాజరుకాకుండా శాయశక్తులా ప్రయ త్నించారు. అంతేకాకుండా ఆ సందర్భంలో రాష్ట్రపతిప్రసంగ ప్రసారాన్ని ఆపేయాల్సిందిగా ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)ని ఆదేశించారు.

 PM Modi

పని లోనే విశ్రాంతి వెతుక్కునే నైజం మోడీది

తద్విరుద్ధంగా మోడీ అసంఖ్యాక సాంస్కృతిక పథకాల ద్వారా నాగరికత పునరుజ్జీవనాన్ని చురుగ్గాప్రోత్సహించారు. రోజుకు కనీసం 16గంటల పని లోనే విశ్రాంతి వెతుక్కునే నైజం మోడీది. అంతకుముందు మూడు దశాబ్దాల పాటు పూర్తికాల సంఘ్ ప్రచారక్ గా, బీజేపీ కార్యకర్తగా మొత్తం మీద 55ఏళ్లుగా ప్రజా సేవలోనే ముని గితేలుతున్నారు. అయితే, మోడీలో కించిత్ అలసట గానీ, కాస్తంత ఉపశమన ధోరణిగానీ కానరావు. దేశంలోని 15 ప్రాదేశిక కమిటీలలో 12సర్దార్ప టేల్ను కాంగ్రెస్ అధ్యక్షు డుగా నియమించేందుకు మొగ్గుచూపగా, మూడు తటస్థంగా ఉండిపోయాయి. అయితే, గాంధీజీ 12 కమిటీల అభీష్టాన్ని తోసిపుచ్చుతూ నెహ్రూకు ఓటువేయడం ద్వారా ప్రధాన మంత్రి అభ్యర్థిత్వానికి పటేల్ను దూరం చేశారు. ఆవిధంగా దేశంలో ఘనత వహించిన వంశపారపర్య రాజకీయ నేతగా నెహ్రూకు, ఆయన వారసత్వం ఇందిరాగాంధీకి బదిలీ అయ్యే లా అత్యంత శ్రద్ధతో పావులు కదిపారు. లక్ష్యమంటే అధికా రం కోసం ఆరాటం కాదన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అలాగే, గాంధీజీ తరహాలో సేవ, త్యాగం అనేవి ఒట్టి మాట లుకావన్నది మోడీ విశ్వసించే వాస్తవం. రాబోయే కొద్ది దశాబ్దాలలో నరేంద్ర మోడీ ఒక ఆదర్శప్రాయ దిగ్గజంగా నిలుస్తారు. ఎందుకంటే ఇకపై ప్రతి ఒక్కరి పనితీరుకూ నరేంద్ర మోదీ నిర్దేశిత ప్రమాణాలే కొలబద్ద.

-బెర్జిన్ దేశాయ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నెహ్రూను క్రాస్ చేసి చరిత్ర సృష్టించిన మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha