Modi : భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖింపబడింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఇవాళ్టితో అత్యంత అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచి, అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ‘ఎలక్టెడ్ పీఎం’ (Elected PM) గా మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. నేటితో ఆయన ప్రధాని పీఠంపై 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీనితో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డు అధికారికంగా బద్దలైంది. 2014 మే నెలలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు మోదీ నాయకత్వంలో వరుసగా సాధించిన విజయాలు, ఆయనకు ప్రజల్లో ఉన్న తిరుగులేని ఆదరణకు ఈ మైలురాయి నిదర్శనంగా నిలిచింది.
Read Also ; ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్న 'సీక్రెట్' డేటింగ్ ట్రెండ్
నాటి ఎన్నికల సమీకరణాలు.. రికార్డుల వెనుక అసలు లెక్కలు ఇవే!
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు మొత్తం 6,130 రోజులు ప్రధానమంత్రిగా దేశానికి సేవాలందించారు. అయితే, ఇందులో ఒక సాంకేతిక పరమైన వ్యత్యాసం ఉంది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి.. తొలి సార్వత్రిక ఎన్నికలు ముగిసి మొదటి పార్లమెంట్ కొలువుదీరే వరకు, అంటే 1952 మే 12 వరకు నెహ్రూ గారు ఎన్నికలు జరగకుండానే (తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా) పదవిలో కొనసాగారు. దేశంలో మొదటి సాధారణ ఎన్నికల అనంతరం 1952 మే 13న ఆయన మొదటిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ‘ఎన్నికైన ప్రధాని’గా నెహ్రూ పదవీకాలం 4,398 రోజులు మాత్రమే. ఈ నేపథ్యంలోనే, నరేంద్ర మోదీ నేటితో 4,399 రోజులు పూర్తి చేసుకుని నెహ్రూ రికార్డును క్రాస్ చేసి, భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం పాలించిన ‘ఎన్నికైన ప్రధాని’గా అగ్రస్థానంలో నిలిచారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

