West Bengal Crime: పశ్చిమ బెంగాల్‌లోని బరైపూర్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణ సామూహిక అత్యాచారం, హత్య కేసులో గుండెలు పిండేసే నిజాలు బయటపడటంతో కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
ఈ ఘోరానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ప్రవాశ్ మోండల్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బరైపూర్ క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ప్రవాశ్ మోండల్‌ను మంగళవారం అర్ధరాత్రి పోలీసులు సంఘటనా స్థలానికి తరలించారు. ఆ సమయంలో నిందితుడు అకస్మాత్తుగా పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని, వారిపైకి కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Read Also : Next Bharat Ventures : నెక్స్ట్ భారత్ వెంచర్స్ సరికొత్త రికార్డు
Accused in Baruipur girl’s rape-murder case killed in encounter
West Bengal Crime: వ్యభిచార గృహానికి అమ్మేందుకు యత్నం..
పోలీసుల విచారణలో ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు సభ్య సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. నిందితులు ఆ 11 ఏళ్ల అమాయక బాలికను బలవంతంగా ఒక వ్యభిచార గృహానికి విక్రయించడానికి ప్రయత్నించారు. అయితే, ఆ చిన్నారి వారి ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించింది. తాము అనుకున్నది జరగకపోవడంతో ఆగ్రహానికి గురైన ముగ్గురు కామాంధులు బాలికపై క్రూరంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అంతటితో ఆగకుండా, తమ పాపం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆ బాలికను సజీవంగానే సమీపంలోని చెరువులో పడేశారు. నీటిలో మునిగిపోవడంతో శ్వాస ఆడక ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ కిరాతకానికి పాల్పడిన ప్రధాన నిందితుడికి పోలీసులు ఎన్‌కౌంటర్‌తో తగిన శాస్తి చేశారని స్థానికులు భావిస్తున్నారు.
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: ఎన్‌డీయే కూటమిలోకి శరద్ పవార్?

