Dailyhunt
పాపం..బాలీవుడ్ లో సాయి పల్లవి కి ఘోర పరాభవం !!

పాపం..బాలీవుడ్ లో సాయి పల్లవి కి ఘోర పరాభవం !!

వార్త 1 week ago

క్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'లేడీ పవర్ స్టార్' సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ అరంగేట్రం విషయంలో అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.

‘ఫిదా’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాలతో మినిమమ్ గ్యారెంటీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె హిందీ ఎంట్రీ మాత్రం షాక్ ఇచ్చింది. తెలుగు, మలయాళ భాషల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి, తన పరిధిని విస్తరించుకుంటూ హిందీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న 'ఏక్ దిన్' చిత్రంలో ఆమె కథానాయికగా నటించింది. మే 1న ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’లో సీతగా నటిస్తున్న సాయి పల్లవికి, ఈ 'ఏక్ దిన్' చిత్రం బాలీవుడ్‌లో తొలి పరీక్షగా నిలవనుంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Read Also : కిల్లింగ్ లుక్స్‌తో కృతి శెట్టి మెరుపులు.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

షాకింగ్ ఓపెనింగ్స్.. 20 లక్షల లోపే వసూళ్లు?

బాలీవుడ్ ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, 'ఏక్ దిన్' చిత్రానికి అత్యంత బలహీనమైన ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదటి రోజు కేవలం రూ. 10 నుంచి 20 లక్షల మధ్యలో మాత్రమే నెట్ వసూళ్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ తనయుడు పరిచయం అవుతున్న సినిమా కావడంతో కనీసం ఒక మోస్తరు వసూళ్లు ఉంటాయని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సోషల్ మీడియాలో కానీ, ఆడియెన్స్‌లో కానీ ఈ సినిమాపై పెద్దగా బజ్ (Buz) కనిపించకపోవడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అదే గనుక జరిగితే, సాయి పల్లవి కెరీర్‌లోనే ఇవి అత్యంత తక్కువ ఓపెనింగ్స్ అని చెప్పాలి.

బజ్ లేని ప్రమోషన్లు.. సాయి పల్లవికి ఎదురుదెబ్బేనా?

సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ మరియు జునైద్ ఖాన్ వంటి స్టార్ కిడ్ ఉన్నప్పటికీ, ఈ సినిమాకు సరైన ప్రమోషన్లు నిర్వహించకపోవడం వల్లే ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. సినిమాపై ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచేలా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు పెద్దగా జరగలేదు. మరి ఇంత తక్కువ ఓపెనింగ్స్‌తో ఈ సినిమా హిందీ మార్కెట్‌లో నిలదొక్కుకుంటుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, సాయి పల్లవికి ఉన్న క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ఏదైనా ఆదరణ లభిస్తుందేమో చూడాలి. ఒకవేళ కంటెంట్ బాగుండి, పాజిటివ్ టాక్ వస్తే తప్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ధనుష్, మమిత బైజు 'కర' సినిమా టాక్ ఎలా ఉందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha