Polavaram Tiger Alert:ఏలూరు జిల్లా పోలవరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పాపికొండలు నేషనల్ పార్క్ పరిసరాల్లో పులి తిరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ఉప్పారేల్లి ప్రాంతంలో పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీనితో పరిసరాల్లో ఉన్న 11 గ్రామాలకు అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Read also: Moharram Holiday 2026: జూన్ 26న మొహర్రం సెలవు.. కేంద్రం క్లారిటీ!
Tiger causes a stir in Polavaram
పర్యాటకం, చేపల వేటపై నిషేధం
ప్రజల భద్రత కోసం అటవీశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోట్ల ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా కఠిన నిషేధం విధించారు. పులి కదలికలు ఉన్నందున అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Polavaram Tiger Alert: గ్రామస్థులకు కఠిన జాగ్రత్తలు
ముంజులూరు, కోటూరుపల్లి, వీరన్నపాలెం, చింతలగూడెం, దండిపూడి గ్రామాల్లో దండోరా ద్వారా అధికారులు అలర్ట్ చేశారు. పశువులను బయట కట్టేయకుండా పాకల్లో ఉంచాలని సూచించారు. రాత్రి వేళల్లో పశువుల పాకల వద్ద లైట్లు ఉంచడం తప్పనిసరి అని తెలిపారు. చెరువులు, అటవీ ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Epaper: epaper.vaartha.com

