Sanitation workers issue:హైదరాబాద్ నగరంలో పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులను కొందరు సూపర్వైజర్లు తీవ్రంగా దోచుకుంటున్నారు.
రాజధానిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 28,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సగం మందికి పైగా కార్మికులు ప్రతి నెలా సూపర్వైజర్లకు మామూళ్లు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కో కార్మికుడు ప్రతినెలా రూ.1,000 కమిషన్ కింద చెల్లించాల్సి వస్తోంది. ఈ లెక్కన చూస్తే సూపర్వైజర్లు ప్రతి నెలా సుమారు రూ.1.5 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అక్రమంగా పోగేసిన సొమ్ముతో కొందరు సూపర్వైజర్లు వడ్డీ వ్యాపారాలు చేస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
Telangana government: అల్పాహార పథకంలో నాణ్యత కరువైంది.. ఎందుకు?
Supervisors who are squeezing the sweat out of the workers
ఏటీఎం కార్డుల స్వాధీనంతో సాగుతున్న అప్పుల ఉచ్చు
సూపర్వైజర్లు కార్మికులకు రూ.5 వడ్డీకి అప్పులు ఇస్తూ వారిని తీవ్ర మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు. అప్పు ఇచ్చే సమయంలో ముందుగానే వారి నుంచి ఏటీఎం తీసుకుంటున్నారు. గడువులోపు అసలు లేదా వడ్డీ చెల్లించకపోతే, ఆ ఏటీఎం కార్డులతో నేరుగా బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసే ఒక్కో కార్మికుడికి రోజువారీ వేతనం రూ.550గా ఉంటుంది. రెండు మూడు రోజులు విధులకు రాకపోతే జీతంలో కోత పడుతుందనే నిబంధనను సూపర్వైజర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ హాజరు వేస్తామంటూ కార్మికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
Sanitation workers issue:రోడ్డున పడుతున్న నిరుపేదలు ఎదిరిస్తే తగిన శాస్తి
ఆల్విన్ కాలనీ, పటాన్‌చెరు, చార్మినార్, ముషీరాబాద్, నాగోల్, మాదాపూర్, నార్సింగి, సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాలలో ఈ దందాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఆల్విన్ కాలనీలో పనిచేసే శ్రీనివాస్ అనే సూపర్వైజర్ వంటి వారు కార్మికులను రోడ్డున పడే పరిస్థితికి తీసుకువచ్చారు. కష్టపడి పనిచేసే పేదల పొట్ట కొడుతున్న ఈ అక్రమ వడ్డీ వ్యాపారాలు మరియు కమిషన్ల దందాలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి. ఇలాంటి సూపర్వైజర్లపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులు రోడ్డెక్కి డిమాండ్ చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

