AP politics: తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అయితే ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, ఐటి, ఉన్నత విద్యారంగాల అభివృద్ధి ద్వారా యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే అని షరీఫ్ తెలిపారు.
బుధవారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో పై విధంగా తెలిపారు. “సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్ళు అనే సిద్దాంతంతో ప్రజల మద్య పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్. కార్యకర్తలే పార్టీకి అధినేత అనే భావనను ఆచరణలో చూపిస్తూ, ప్రతి కార్యకర్తకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ టిడిపిలోనే ఉంది.
The TDP’s Organizational Structure
AP politics: సామాజిక న్యాయంతో కమిటీల ఏర్పాటు
1985లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కంప్యూటరీకరణ చేసి సాంకేతికతను రాజకీయ వ్యవస్థలో ప్రవేశపెట్టిన దూరదృష్టి నాయకులు చంద్రబాబు నాయుడు. దేశంలోని ఏ ఇతర ప్రాంతీయ పార్టీకి లేనంత భారీ సభ్యత్వ బలం తెలుగుదేశం పార్టీకి విద్యావంతులు, నిపుణులు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికి రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. నాడు ఎన్టీఆర్ వేసిన బలమైన పునాదులపై, నేడు చంద్రబాబు నాయుడు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత ఆధునికంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నారు. పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయాన్ని పొలిట్బ్యూరో, జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు” అని షరీఫ్ కొనియాడారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

