Nellore boat accident: ఘటన వివరాలను సేకరిస్తున్న పోలీసులు బోగోలు మండలం తాటి చెట్ల పాలెం సముద్ర తీరాన బుధవారం వేకువ జామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మండలంలోని జువ్వలదిన్నె అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు నాటు పడవ సహాయంతో కూర కోసం సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా పెనుగాలులు వీచడంతో నాటు పడవ బోల్తా పడి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో తుపిలి బాలమురళి(55), కొమరి గోవిందు(44)లు మృతదేహాలు పాతపాలెం వద్ద లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు దీంతో ఒక్కసారిగా తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది బంధువుల అర్తనాదాలు సముద్ర తీరాన ఘోషించాయి..
Read also: AP Temperature : ఏపీలో భానుడి భగభగలు..నేడు అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత
Rescue team at the fishing boat capsized site)
Nellore boat accident: ఇద్దరు మత్స్యకారుల మృతి, కొనసాగుతున్న గాలింపు
ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న బిట్రగుంట ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీసి శవపరీక్ష నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకట్ కృష్ణారెడ్డి మహానాడు కార్యక్రమంలో ఉన్నప్పటికీ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేసి మృతి చెందిన మత్స్య కారుడి కుటుంబానికి తక్షణ సహాయంగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

