Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

వార్త 2 months ago

Pedda Shankarampet: కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు.

మంగళవారం నాడు స్థానిక రైతువేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 93 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుఅందేవిధంగాచర్యలుతీసుకుంటున్నామని తెలిపారు.

Read Also:Free Medical Camp Kambalapally: కంబాలపల్లిలో అంబేద్కర్ జయంతి: ఆద్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

 MLA Sanjeeva Reddy Narayankhed

Pedda Shankarampet: కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందాయని విమర్శించారు. త్వరలోనే లబ్ధిదారులకు రెండవ విడత ఇందిర ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు మండల పరిధిలోని శివాయపల్లి గ్రామంలో ఐకపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రభుదాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుమాల్ గౌడ్, నాయకులు నారా గౌడ్, మురళి పంతులు, రాజేందర్ గౌడ్, దాచా సంగమేశ్వర్, సుభాష్, కుంట్ల రాములు ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గొంగూరు గ్యాస్ గోదాం వద్ద బారులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha