Nellore district ACB raids: ఏఎస్ పేట మండలంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పు (మ్యూటేషన్) చేసేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం ఆకస్మికంగా దాడి నిర్వహించినట్లు సమాచారం.
Read Also : Pocso E Box App: లైంగిక వేధింపులా? 'పోక్సో ఈ-బాక్స్' ద్వారా ఫిర్యాదు చేయొచ్చు!
MRO caught by ACB while accepting a bribe to change a name in the passbook.
Nellore district ACB raids: రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారి
పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేయడానికి ఎమ్మార్వో రూ.20 వేల లంచం కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు వల పన్ని సదరు అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం ఏసీబీ అధికారులు ఎమ్మార్వో కార్యాలయం మరియు సంబంధిత ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

