Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. కలెక్టర్ కీలక ఉత్తర్వులు

పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. కలెక్టర్ కీలక ఉత్తర్వులు

వార్త 3 months ago

బాపట్ల జిల్లాలో పాస్టర్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు

Bapatla latest news : ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ హోదాపై మరోసారి చర్చకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది.

బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్‌కు జారీ చేసిన షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) సర్టిఫికెట్‌ను జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

క్రైస్తవ మత స్వీకరణతో వెలుగులోకి వచ్చిన వివాదం

బాపట్ల జిల్లా పరిపాలన నిర్వహించిన విచారణలో చింతాడ ఆనంద్ క్రైస్తవ మతాన్ని స్వీకరించి, పాస్టర్‌గా సేవలు అందిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేయగా, దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ వ్యవహారం పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన అక్కల రామిరెడ్డి చేసిన ఫిర్యాదుతో ప్రారంభమైంది.

Read Also : సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి

 Bapatla latest news

సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం.. అప్పీల్‌కు 30 రోజుల గడువు

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కీలకంగా మారింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ కేటగిరీలో పరిగణించబడరని కోర్టు స్పష్టం చేసింది. జిల్లా స్థాయి పరిశీలన కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు చింతాడ ఆనంద్‌కు 30 రోజుల గడువు ఇచ్చారు. మరోవైపు, తాను ఎస్సీగా పుట్టానని, కేవలం క్రైస్తవ మతాన్ని విశ్వసించానని చింతాడ ఆనంద్ వెల్లడించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కార్యకర్తలకు గుర్తింపు ఇస్తాం.. జూమ్ కాన్ఫరెన్స్‌లో లోకేష్ భరోసా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha