Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర కలకలం రేపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనకంటే చదువులో బాగా చదువుతున్నాడని కక్ష, అక్కసుతో ఓ యువకుడు తన సొంత స్నేహితుడిపైనే కత్తితో దాడికి తెగబడ్డాడు.
ఈ ఘోర ఘటన బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read Also : Ex Bus Driver : మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో కోట్లాది నగదు, 15 కిలోల బంగారం
Atrocity in Old City: Youth attacks friend with a knife because he was doing well in his studies!
Hyderabad Old City: ఒకే ట్యూషన్.. అసూయతో పెరిగిన కక్ష!
బాధితుడు మోబిన్, దాడికి పాల్పడిన నిజాం ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ రోజూ ఒకే ట్యూషన్‌లో చదువుకుంటున్నారు. అయితే, చదువులో, పరీక్షల మార్కుల్లో మోబిన్ తనకంటే ముందుంటున్నాడని నిజాం తీవ్రమైన అసూయ, ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మోబిన్‌పై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుని, అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
తీవ్ర గాయాలపాలైన మోబిన్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బహదూర్‌పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

