Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాఠశాల విద్య శాఖలో భారీగా బదిలీలు

పాఠశాల విద్య శాఖలో భారీగా బదిలీలు

వార్త 1 week ago

TG School Education Transfers: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో సాధారణ బద లీలకు అనుమతులు కల్పించిన నేపథ్యంలో పాఠశాల విద్య శాఖలో భారీగా బదలీలు చేపట్టారు.

ఐదుగురు అడిషనల్ డైరెక్టర్లతోపాటు జాయింట్ డైరక్టర్లను, జిల్లా విద్యా శాఖాధికారుల(డీఈవో)ను సైతం బదలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదలీలకు ఆదివారం చివరి రోజు కావడంతో పాఠశాల విద్య శాఖలో బదలీలను చేపట్టారు.

Read Also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం

 Massive transfers in the School Education Department

TG School Education Transfers: అడిషనల్ డైరెక్టర్ల బదిలీల వివరాలు

బదలీల్లో భాగంగా సమగ్రశిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరె క్టర్(ఏఎస్పిడి)గా పివి శ్రీహరిని బదలీ చేశారు. ప్రస్తుతం ఆయన టాప్ డైరక్టర్ కొనసాగుతూ ప్రభుత్వ పరీక్షల డైరక్టర్గా అదనపు బాధ్యతలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల విద్య శాఖ డైరక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరక్టర్ కోఆర్డినేషన్ కొనసాగుతున్న కె లింగయ్యను టాస్ డైరక్టర్ గా ప్రభుత్వ పరీక్షల డైరక్టర్గా ఎఫ్ ఏసీ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం టిజిఆం ఈఐఎస్ సెక్రటరీగా ఉన్న సిహెచ్ రమణ కుమార్ను మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరెక్టర్గా బదలీ చేశారు. సమగ్ర శిక్ష ఏఎస్పీడీగా ఉన్న రాధారెడ్డిని గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్గా బదలీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అడిషనల్ డైరక్టర్గా ఉన్న జి ఉషారాణిని టిజి ఆర్ఐఎస్ సెక్రటరీగా బదలీ చేశా రు.

జాయింట్ డైరెక్టర్ల కొత్త బాధ్యతలు

సమగ్ర శిక్ష జేడీగా కొనసాగుతున్న పి రాజీ వ్ను టాస్ జేడీగా, టాస్ జేడీగా ఉన్న ఎం సోమిరెడ్డిని హైదరాబాద్ ఆర్జే జేడీగా, వరంగల్ ఆర్జేడీగా ఉన్న కె సత్యనారాయణ రెడ్డిని మోడల్ స్కూల్స్ జాయింట్ డైరక్టర్గా కోఆర్డినేషన్ అడిషనల్ డైరక్టర్గా ఎఫ్ఎసీ బాధ్యతలు అప్పగించారు. సర్వీసెస్ జాయింట్ డైరక్టర్గా ఉన్న పి మదన్మోహన్ను సమగ్రశిక్ష జేడీ1గా బదలీ చేశారు. మాసబ్యాంక్లో ఉన్న ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఏ ఉషారాణిని సమగ్రశిక్ష జేడీ2గా బదలీ చేశారు. సమగ్రశిక్ష జేడీగా ఉన్న వి వెంకటనర్సమ్మను జాయింట్ డైరక్టర్ సర్వీసెస్ బదలీ చేశారు. హైదరాబాద్ ఆర్జేడీగా ఉన్న ఈ విజయలక్ష్మీని వరంగల్ ఆర్జేడీగా బదలీ చేశారు. హైదరాబాద్ డీఈవోగా ఉన్న ఆర్ రోహిణిని సంగారెడ్డి డీఈవోగా, సంగారెడ్డి డీఈవోగా ఉన్న వెంకటేశ్వర్లును రంగారెడ్డి డీఈవోగా, మంచిర్యాల్ డీఈవోగా ఉన్న యాదయ్యను హైదరాబాద్ డీఈవో గా బదలీ చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha