Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదేళ్ల తర్వాత మారిన GHMC లోగో

పదేళ్ల తర్వాత మారిన GHMC లోగో

వార్త 3 weeks ago

GHMC Logo : హైదరాబాద్ మహానగర పాలనను మరింత వేగవంతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నూతన లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు.

నగరాభివృద్ధి, వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ నుంచి వేరుపడిన సైబరాబాద్ (CMC), మల్కాజ్‌గిరి (MMC) మున్సిపల్ కార్పొరేషన్లకు సైతం కొత్త లోగోలను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. ‘న్యూ ఐడెంటిటీ, న్యూ డెస్టినీ, న్యూ లోగో’ అనే నినాదంతో ప్రజాపాలనకు సరికొత్త రూపురేఖలు దిద్దుతున్నామని, వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పాలనా వికేంద్రీకరణను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు వెల్లడించారు.

మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి ప్రారంభం: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

లోగోల ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు, అంబర్‌పేట్ – మూసారాంబాగ్ మధ్య మూసీ నదిపై రూ. 52 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన 400 మీటర్ల హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో మూసీ వరద నీటి కారణంగా మూసారాంబాగ్ వద్ద రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు ఈ బ్రిడ్జితో శాశ్వత పరిష్కారం లభించింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో అంబర్‌పేట్, రామాంతపూర్ నుంచి మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం గణనీయంగా ఆదా కానుంది.

కన్నీళ్లతో కవిత ఆవేదన.. 'నేను పిరికిదాన్ని కాదు'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha