Dailyhunt
పదో తరగతి ఫలితాల్లో తాడిపత్రి ప్రభంజనం

పదో తరగతి ఫలితాల్లో తాడిపత్రి ప్రభంజనం

వార్త 1 week ago

AP 10th Results: సాధారణ విద్యార్థులతో అసాధారణ ప్రతిభ కనబరిచిన పద్మవాణి హైస్కూల్ విద్యార్థులు. 593 మార్కులు సాధించిన అర్జు పర్వీన్. 550 మార్కులుపైగా సాధించిన 33 మంది విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2026 సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ పద్మవాణి హై స్కూల్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచినట్లు కరెస్పాండెంట్ నాగపీరయ్య ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ విద్యార్థులచే అసాధారణ ఫలితాలను తమ పాఠశాల సాధించిందని అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు తోడ్పటు అందించిన అధ్యాపకులను ఆయన అభినందించారు. పాఠశాల టాపర్ గా అర్జు పర్వీన్ 593 మార్కులు, నస్రీన నజ్మి ( 588), మహమ్మద్ ఆసిఫ్ (587), ఎన్ మోహిత్ చౌదరి (585), డి వెంకట తేజస్విని (585) కె.హమీర్ (584), బి .మంజునాథ యాదవ్ (583), ఎస్ .ఆఫ్రా ఆయాన్ (583), పి యాస్మిన్(583), ఏ. మహమ్మద్ అకిఫ్ (581) మార్కులు సాధించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha