Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పైపులైన్ గుంతలోకి పల్టీ కొట్టిన కారు.. కొన ఊపిరితో బయటపడ్డ దంపతులు

పైపులైన్ గుంతలోకి పల్టీ కొట్టిన కారు.. కొన ఊపిరితో బయటపడ్డ దంపతులు

వార్త 3 months ago

Kamareddy incident: కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన కారు రైల్వే అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ కోసం తవ్విన లోతైన గుంతలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also :Mumbai Family Death Case: ముంబై కుటుంబ మరణాల కేసు విచారణలో కీలక విషయాలు

Kamareddy incident: ప్రమాదం జరిగిందిలా..

రామారెడ్డి మండలం రంగంపేట వద్ద రైల్వే అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. కామారెడ్డికి చెందిన మొగుళ్ల వనిత, రమేష్ గౌడ్ దంపతులు కారులో వెళ్తుండగా, ప్రమాదవశాత్తు వారి వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పైప్‌లైన్ గుంతలోకి పల్టీ కొట్టింది. కారు లోపల పడిపోవడంతో బయటి వారికి వెంటనే కనిపించలేదు.

జేసీబీతో ప్రాణాలు కాపాడిన సిబ్బంది

గుంతలో నుంచి బాధితుల కేకలు వినిపించడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. కారు గుంతలో ఇరుక్కుపోవడంతో, జేసీబీ సహాయంతో అతి కష్టమ్మీద దంపతులిద్దరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వనిత, రమేష్ గౌడ్‌లను 108 అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు. సమయానికి స్పందించి జేసీబీతో ప్రాణాలు కాపాడిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్‌రే భార్య దారుణ హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha