Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలి

వార్త 2 months ago

TG CEO Sudarshan Reddy: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రి యను విజయవంతం చేసేందుకు ఫీల్డ్ స్థాయిలో విధులు నిర్వహించే బీఎల్ఎలు, బీఎల్ సూపర్వైజర్లకు తగిన భద్రత, సహకారం అందించాలని, అలాగే సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీస్లు పెట్రోలింగ్ ను నిర్వహించాలని సంబంధిత పోలీసు అధికా రులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు.

ఎస్ఐఆర్ కార్యక్రమం పకడ్బందీగా నిర్వ హించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం అని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యా లయంలో సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Read also: TG ECET : జూన్ 15 నుంచి TG ECET కౌన్సెలింగ్

TG CEO Sudarshan Reddy: జూన్ 25 నుంచి ఇంటింటికీ ఎన్యుమరేషన్ సర్వే

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఈనెల 25.06.2026 నుండి ప్రారంభం అవుతుందని, కావున బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, తిరిగి వాటిని సేకరించాలని ఆయన సూచించారు. అలాగే ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే బీఎల్ ఓలు, బీఎల్ ఓ సూపర్వైజర్ల పేర్లను, ఫోన్ నెంబర్లను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలని ఎన్నికల అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా సమన్వయం చేసుకోవడానికి పోలీసు అధికారుల ఫోన్ నెంబ ర్లను కూడా ఎన్నికల అధికారులు సేకరించు కోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సర్వే సందర్భంగా ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జగరకుండా పోలీసు అధికారులతో సమన్వ య సమావేశాలు నిర్వ హించుకోవాలని డీఈ ఓలను ఆదేశించారు.

సమావేశంలో పాల్గొన్న ఇతర ఉన్నతాధికారులు

ఈ సందర్భంగా హైద రాబాద్ సౌత్ రేంజ్ పోలీసు అదనపు కమిషనర్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ విధుల్లో పాల్గొనే అన్ని బీఎల్ ఓలు, ఇతర అధికారులకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ), గ్రేటర్ హైదరాబాద్ మున్సివల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్, రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు డీఈఓలు, ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, డిప్యూటీ సీఈఓ (ఎఫ్ఎసీ), నోడల్ అధికారులు, పీఎంఐటీ, ఇతర సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

పెన్షన్ డబ్బుల కోసం తండ్రి పట్ల పిల్లల రాక్షసత్వం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha