Moula Ali Crime: హైదరాబాద్ మహానగరంలో ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన మౌలాలి రిటైర్డ్ రైల్వే ఉద్యోగి పాశవిక హత్య కేసులో మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు అత్యంత సంచలన, చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
కన్న తండ్రిని పెన్షన్ డబ్బుల కోసం కత్తులతో నరికి ముక్కలు ముక్కలు చేసిన కూతురు, కొడుకుకు మరణ శిక్ష (ఉరిశిక్ష) విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి పూర్తి స్థాయిలో సహకరించిన కన్న తల్లికి కోర్టు జీవిత ఖైదు విధించింది.
Read also:Narayanapet Crime: అరేయ్ మీరేం స్నేహితులురా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఇంతకు తెగిస్తారా!
మౌలాలిలో 2019 నాటి ఘోరం - పెన్షన్ ఆశే కారణం
Malkajgiri District Court Death Sentence Brother Sister Father Murder Moula Ali Hyderabad Maruti Suthar Railway Pension
హైదరాబాద్‌లోని మౌలాలి పరిధిలో నివసించే మారుతి సుతార్ (70) ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఆయనకు వచ్చే నెలవారీ పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ముపై ఆయన భార్య, పిల్లలు కన్నేశారు. మారుతి సుతార్‌ను వదిలించుకోవాలని కొడుకు కిషన్, కూతురు ప్రపుల్ల, భార్య గంగాబాయి పక్కా స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే అత్యంత విషపూరితమైన ఉమ్మెత్త పువ్వులు, కాయలను తీసుకొచ్చి, వాటిని ఎండబెట్టి పొడి చేశారు. ఆ విషపు పొడిని మారుతి సుతార్ తినే అన్నంలో కలిపి పెట్టారు.
కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలోకి
విషాన్నం తిన్న మారుతి సుతార్ కొద్దిసేపటికే స్పృహతప్పి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. తండ్రి మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత.. కొడుకు కిషన్, కూతురు ప్రపుల్ల కత్తులు తీసుకుని కన్నతండ్రి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను బకెట్లలో నింపి, ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా పారేయాలని ప్లాన్ చేశారు. అయితే, సరిగ్గా అదే సమయంలో వారి ఎదురింట్లో ఒక శుభకార్యం జరుగుతుండటంతో.. బయటకు వెళ్తే ఎక్కడ దొరికిపోతామోనని భయపడి ఆ శరీర భాగాల బకెట్లను రెండు రోజుల పాటు ఇంట్లోనే దాచేశారు. రెండు రోజుల తర్వాత శవం కుళ్ళిపోయి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఇళ్లపై దాడి చేసి భార్య, కొడుకు, కూతురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Moula Ali Crime: కోర్టు సంచలన తీర్పు - రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్
ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన మల్కాజ్‌గిరి జిల్లా కోర్టు, నిందితులపై మోపబడిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో సహా నిరూపితం కావడంతో ఈ రోజు తుది తీర్పును వెలువరించింది. కన్నతండ్రి అని కూడా చూడకుండా పెన్షన్ డబ్బుల కోసం దారుణంగా నరికి చంపిన కొడుకు కిషన్, కూతురు ప్రపుల్లల చర్యను ‘అరుదైన వాటిల్లో కల్లా అత్యంత అరుదైన కేసు’ (Rare of the Rare Case) గా పరిగణించిన న్యాయస్థానం.. ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. భర్తను చంపేందుకు పిల్లలకు విషాన్ని అందించి, శవాన్ని ముక్కలు చేయడానికి సహకరించిన భార్య గంగాబాయికి జీవిత కాలం జైలు శిక్ష (జీవిత ఖైదు) విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

