Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పల్లెల్లో కరువు పనికి ఫుల్​ డిమాండ్​!

పల్లెల్లో కరువు పనికి ఫుల్​ డిమాండ్​!

వార్త 5 hrs ago

Elnino impact:తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉపాధి హామీ పథకంపై తీవ్రంగా ఆధారపడుతున్నారు.

రాష్ట్రంలో ఉపాధి పనులకు భారీ డిమాండ్ ఏర్పడటంతో దాదాపు 2,25,302 కుటుంబాలు కొత్త జాబ్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించాయి. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉపాధి అవకాశాలను పల్లె ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Enumamula market: జోరందుకున్న మిర్చి కొనుగోళ్లు

 Huge demand for ‘famine relief work’!

కొత్త జాబ్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి వివరాలు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ కొత్త కార్డులు మంజూరు చేస్తోంది. పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా చాటింపు వేయించి దరఖాస్తులు స్వీకరించడంతో సుమారు 12,760 గ్రామాల నుంచి ప్రజలు ముందుకు వచ్చారు. ఇప్పటివరకు 39,188 కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయగా 1,90,184 మంది లబ్ధి చేకూరుతున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 2,800 కుటుంబాల వారు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుత కొత్త కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 52,51,582 కుటుంబాలకు చెందిన 1.02 కోట్ల మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారు.

Elnino impact:ఉపాధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక మేట్ల నియామకం

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 40 మంది కూలీలకు ఒకరు చొప్పున రోజ్ గార్ సేవక్ మేట్లను నియమించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. కూలీల సమీకరణ పనుల కేటాయింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన మేట్లకు మండల కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి 25 శాతం పని దినాలు కొత్తగా 95 పని రకాలు పెరగడం వల్ల వ్యవసాయ కూలీలకు యాసంగి కాలంలో మెరుగైన ఉపాధి లభించే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

రూ.5000 దాటిన వడ్ల ధర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha