Record price paddy:తెలంగాణలో వరి ధాన్యానికి బహిరంగ మార్కెట్‌లో చారిత్రక రికార్డు స్థాయి ధర లభించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేశముద్రం మార్కెట్లో జై శ్రీరామ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.5,016 ధర పలికింది.
ప్రభుత్వ మద్దతు ధర రూ.2,961 కంటే బహిరంగ మార్కెట్‌లో ధర చాలా ఎక్కువగా ఉండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Rice millers: సన్న బియ్యం కుంభకోణం.. 14 మంది అరెస్ట్
Paddy price crosses Rs 5,000 per quintal
ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలు
సాగు విస్తీర్ణం తగ్గిపోవడం పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. వాతావరణ మార్పులు ఎల్ నినో ప్రభావం వల్ల దిగుబడి తగ్గింది. ఈ పరిణామాల కారణంగా మార్కెట్‌లో పోటీ తీవ్రమైంది.
Record price paddy:సామాన్య వినియోగదారులపై అదనపు భారం
ధాన్యం ధరలు భారీగా పెరగడం వలన సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ లభించడం రైతులకు లాభసాటిగా మారినప్పటికీ బియ్యం కొనుగోలు చేసే సామాన్యులకు ఖర్చులు పెరుగుతున్నాయి.
Epaper: epaper.vaartha.com

