Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పల్నాడులో ఘోర ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి!

పల్నాడులో ఘోర ప్రమాదం..నలుగురు హైదరాబాద్ వాసులు మృతి!

వార్త 1 week ago

Palnadu Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన వారిని విధి వంచించింది.

మాచర్ల నగరవనం (Macherla Nagaravanam) వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ ప్రైవేట్ 'తుఫాన్' (Toofan) ట్రావెల్ వాహనం అతివేగంగా వచ్చి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా హైదరాబాద్ (Hyderabad) వాసులుగా పోలీసులు గుర్తించారు.

Read also:Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆర్మీ సిబ్బంది

ప్రమాదం ఎలా జరిగిందంటే..?

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ప్రకాశం జిల్లాలోని పామూరు (Pamuru) కు తుఫాన్ వాహనంలో బయలుదేరారు. వాహనం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ పరిధిలోని నగరవనం వద్దకు రాగానే.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని డ్రైవర్ గమనించకపోవడంతో అతివేగంగా వెళ్లి వెనుక భాగంలోకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు తుఫాన్ వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు వాహనం శిథిలాల మధ్య ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేశారు. ఈ క్రమంలో నలుగురు ఘటనా స్థలంలోనే విగతజీవులుగా మారారు.

Palnadu Road Accident: సహాయక చర్యలు - పలువురి పరిస్థితి విషమం

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మాచర్ల పోలీసులు స్థానికులతో కలిసి రెస్క్యూ చర్యలు చేపట్టారు. వాహనంలో ఇరుక్కుపోయిన వారిని గ్యాస్ కట్టర్ల సాయంతో అతికష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారందరినీ వెంటనే 108 అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి (Macherla Government Hospital) తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదంపై మాచర్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గురైన వాహనాల క్లియరెన్స్ చేపట్టారు. హైదరాబాద్‌లో ఉన్న మృతుల, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు.

వామ్మో.. 'Splendor' దొంగ..ఇదేం వింత రోగం !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha