తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో ఒకటి లేదా రెండు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
Read Also: National Dengue Day: జాతీయ డెంగ్యూ దినోత్సవం వేళ అవగాహన ర్యాలీ!
Telangana Rain
Telangana Rain: మే 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ప్రయాణించి, ఈ నెల 26వ తేదీన కేరళ తీరాన్ని తాకనున్నాయి. అక్కడి నుంచి మరో నాలుగైదు రోజుల్లో ఇవి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోందని, దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు చక్రవాత ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రానున్న రెండు మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో పగటి వేడితో పాటు రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీల వరకు నమోదవుతుండటంతో ఉక్కపోత, అసౌకర్య వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నెలాఖరులో వడగాలుల హెచ్చరిక
ఇవాళ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో 41-44 డిగ్రీలు, మిగతా జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఎండ తీవ్రత ఉంది. ఈ నెలాఖరు నాటికి ఎండలు మరింత ముదిరి వడగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

