Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన

వార్త 1 week ago

Gummadidala News: గుమ్మడిదలలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ పర్యటన: కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట నర్సింగరావు. గుమ్మడిదల మండల కేంద్రంలో నేడు ,జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రూ.15 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు గుమ్మడిదల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నర్సింగరావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. గుమ్మడిదల మండల పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఆరోగ్య సేవలు, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా మండల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

Read Also:Gangojipet Crime: భార్య కాళ్లు నరికిన కిరాతక భర్త!

Gummadidala News:మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

మంత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుట్ట నర్సింగరావు కోరారు. పార్టీ కార్యకర్తలు సకాలంలో కార్యక్రమ ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, గుమ్మడిదల మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఇప్ప పెంటారెడ్డి, కౌన్సిలర్ మూడు చింతల నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి,మాజీ మండల అధ్యక్షుడు మద్ది వీరారెడ్డి, జయశంకర్ గౌడ్, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మద్ది ప్రతాపరెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, నాయకులు ఆకుల ఆంజనేయులు, తుడుం శ్రీనివాస్, కుమ్మరి వెంకటేష్, దోమడుగు కృష్ణ, కానుకుంటా గ్రామ అధ్యక్షుడు అంజత్ భాష, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రహదారిపై వరి ధాన్యం పోసి రైతుల నిరసన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha